సెలబ్రిటీస్‌తో సెల్ఫీలు దిగడం చాలా మంది అభిమానుల కోరిక. కానీ అప్పుడప్పుడూ వీటికి సంబంధించి ఆశ్చర్యకరమైన సంఘటనలు కూడా జరుగుతుంటాయి. తాజాగా, ఆస్ట్రేలియా యువ ఓపెనర్ సామ్ కోన్స్టాస్‌కు సంబంధించిన ఓ ఘటన నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.
ప్రాక్టీస్ కోసం తన లగేజీ పట్టుకొని గ్రౌండ్‌కు వెళ్తున్న కోన్స్టాస్‌ను వెనుక నుంచి ఒక క్రికెట్ అభిమాని కారులో చూసి ఆగిపోయాడు. అతని ఆటోగ్రాఫ్, సెల్ఫీ కోసం కారును పార్క్ చేసి అతడి వైపు పరిగెత్తాడు. కానీ ఇక్కడే అతని పొరపాటు జరిగింది. హడావుడిలో హ్యాండ్ బ్రేక్ వేయడం మర్చిపోయాడు.
ఆ ప్రాంతం కొద్దిగా వంకరగా ఉండటంతో కారు పార్కింగ్ నుంచి ముందుకు కదిలింది. ఇది గమనించిన అభిమాని వెంటనే వెనక్కి పరిగెత్తి కారును ఆపేందుకు ప్రయత్నించాడు. కానీ అతడి ప్రయత్నాలు ఫలించలేదు. చివరికి, కారు మరో పార్క్ చేసిన బండిని ఢీకొట్టింది. సంతోషకరమైన విషయం ఏమిటంటే, ఎవరికీ గాయాలు కాలేదు. చిన్న గుద్దుగా ముగిసిన ఈ ఘటన పెద్ద ప్రమాదానికి దారితీయలేదు.
సెల్ఫీ మిస్!
ఇంతలో సెల్ఫీ అవకాశాన్ని కూడా కోల్పోయిన అభిమానికి పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారింది. అతను కోన్స్టాస్‌ను కలిశాడా లేదా అన్నది తెలియకపోయినా, ఈ ఘటన సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. సామ్ కోన్స్టాస్ ఇటీవల తన ఆటతీరుతో పాటు భారత్‌తో సిరీస్‌లో విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రాలతో జరిగిన ఘర్షణ వల్ల కూడా భారీగా పాపులర్ అయ్యాడు. సెల్ఫీ ఘటనతో ఆయన పేరు మరోసారి వార్తల్లో నిలిచింది.
One of the costliest attempts to take a picture with Sam Konstas. 🤣pic.twitter.com/HxnFTivMi0
— Mufaddal Vohra (@mufaddal_vohra) January 15, 2025