17 ఏళ్ల తర్వాత హైదరాబాద్‌లో అడుగుపెట్టిన డబ్ల్యూడబ్ల్యూఈ సూపర్ స్టార్ జాన్ సీనా

John Cena Receives Grand Welcome at Hyderabad For WWE Superstar Spectacle Event in India,John Cena Receives Grand Welcome at Hyderabad,Grand Welcome at Hyderabad For WWE Superstar,WWE Superstar Spectacle Event in India,WWE Superstar John Cena,Mango News,Mango News Telugu,WWE Heat, went to Peaks, WWE Superstar, John Cena, John Cena entered India, Hyderabad,John Cena Latest News,John Cena Latest Updates,John Cena Live Updates

అభిమానులంతా ఎంతగానో ఎదురుచూసిన హాలీవుడ్ హీరో, డబ్ల్యూడబ్ల్యూఈ సూపర్ స్టార్ జాన్ సీనా..17 ఏళ్ల తర్వాత శుక్రవారం సాయంత్రం హైదరాబాద్‌కు వచ్చేసాడు. దీంతో హైదరాబాద్‌లో డబ్ల్యూడబ్ల్యూఈ హీట్ పీక్స్‌కు వెళ్లిపోయింది. హైదరాబాద్‌లోని జీఎంసీ బాలయోగి ఇండోర్ స్టేడియంలో డబ్ల్యూడబ్ల్యూఈ సూపర్ స్టార్ స్పెక్టేకిల్ షో సెప్టెంబర్ 8 నుంచి ప్రారంభమయిన సంగతి తెలిసిందే. దాదాపు ఏడేళ్ల తర్వాత మళ్లీ డబ్ల్యూడబ్ల్యూఈ మన దేశానికి రావడం.. అందులోనూ భాగ్యనగరమే దానికి ఆతిథ్యం ఇవ్వడంతో ఫ్యాన్స్ నుంచి ఈ షోకు ఊహించని స్పందన వస్తోంది.

హైదరాబాద్‌కు వచ్చిన జాన్ సీనాకు సర్ఫ్రైజ్ ఇచ్చారు ఫ్యాన్స్. జాన్ సీనాను ఎయిర్‌పోర్టులో చూసిన అభిమానులు చీర్ చేస్తూ గ్రాండ్ వెల్కమ్ పలికారు. తెల్ల టీషర్ట్, బ్లాక్ షార్ట్స్, క్యాప్‌తో వచ్చిన జాన్ సీనాకు.. అతను బస చేయబోయే హోటల్ నుంచి అదిరిపోయే వెల్కమ్ లభించింది. కొద్ది రోజుల క్రితమే తను డబ్ల్యూడబ్ల్యూఈ సూపర్ స్టార్ స్పెక్టేకిల్ కోసం.. హైదరాబాద్ వస్తానని చెబుతూ జాన్ సీనా ట్వీట్ చేయడంతోనే ఫ్యాన్స్ సంతోషంతో ఊగిపోయారు. భారత్ వచ్చేందుకు తాను చాలా ఉత్సాహంగా ఎదురు చూస్తున్నానని జాన్ సీనా చేసిన ట్వీట్‌ను సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మార్చేశారు.

హైదరాబాద్‌లో జరుగుతున్న షోలో డబ్ల్యూడబ్ల్యూఈ హీరోలయిన జాన్‌ సీనా, జిందర్‌ మహల్‌, ఇండస్‌ షేర్‌, నటాల్య వంటివారు తమ టెక్నిక్‌తో అందర్నీ కట్టిపడేయడనున్నారు. వరల్డ్ వైడ్‌గా కోట్లాది మంది అభిమానాన్ని పొందిన డబ్ల్యూడబ్ల్యూఈలో.. ఇప్పుడు భారత రెజ్లర్లతో పాటు ఇతర దేశాలకు చెందిన ఫేమస్ రెజ్లర్లు తమను ప్రపంచవ్యాప్తంగా సత్తాచాటేందుకు రెడీ అయ్యారు. 28 మంది అంతర్జాతీయ రెజ్లింగ్ ఛాంపియన్స్‌తో ఈ షో అదరగొట్టబోతోంది. ఇప్పటికే తన వైవిధ్యమైన ఆటతీరుతో లెక్కకు మిక్కిలి టైటిళ్లు కొల్లగొట్టిన జాన్‌సేనా.. హైదరాబాద్‌లో ఫ్రీకిన్‌ రోలిన్స్‌ జతగా బరిలోకి దిగుతుండటంతో ఫ్యాన్స్ ఇక పూనకాలతో ఊగిపోవడం గ్యారంటీ.

జాన్ సేనా, ఫ్రీకిన్ రోలిన్స్ ఇద్దరూ.. గివోని విన్సీ, లుడ్విగ్‌ కైసర్‌తో పోటీపడి అమీతుమీ తేల్చుకోనున్నారు. డబ్ల్యూడబ్ల్యూఈ ట్యాగ్‌ టీమ్‌ టైటిల్‌ కోసం ఇండస్‌ షేర్‌(సంగా, వీర్‌), కెవిన్‌ ఒవెన్స్‌, సమి జైన్‌ మధ్య యుద్ధం జరుగుతుంది. మహిళల డబ్ల్యూడబ్ల్యూఈ వరల్డ్‌ టైటిల్‌ కోసం రియా రిప్లే, నటాల్యతో అమీతుమీ తేల్చుకోనుంది. వీరితో పాటు షాంకీ, డ్రూ మెక్‌లెట్రీ, జియోనీ విన్సీ, రింగ్‌ జనరల్‌ గుంతర్‌ బరిలో దిగనున్నారు. ఇక నెలరోజుల ముందే ఈ షో టికెట్లు సోల్డ్ అవుట్ అవడంతో నిర్వాహకులే షాక్ అయ్యారట.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here