ఖర్జూరాన్ని షుగర్ వ్యాధి గ్రస్తులు తినొచ్చా?..

చూడగానే తినాలనిపించేలా ఉండే ఖర్జూరం పండులో ఎన్నో పోషకాలు ఉంటాయి. ఆరోగ్యానికి ఈపండు ఎంతో మేలు చేస్తుంది . కాస్త నీరసంగా ఉన్నప్పుడు తీసుకుంటే..తక్షణ శక్తిని ఇస్తుంది. ఏ పండయినా పండుగా ఉన్నప్పుడే బాగుంటుంది. కానీ ఖర్జూరపండు ఎండినా రుచిగానే ఉంటుంది. నట్‌గా మారిన ఎండు ఖర్జూరంలోని నీళ్లన్నీ ఆవిరైపోయి మరింత తియ్యగా ఉంటుంది.

ఎండు ఖర్జూరంలో అనేక పోషకాలు ఉంటాయి. సంప్రదాయఫలంగానూ నీరాజనాలందుకుంటుంది ఈ ఖర్జూరం. తరచూ డేట్స్ తింటే అనేక అనారోగ్య సమస్యల నుంచి దూరంగా ఉంచొచ్చు. అందువల్లే డేట్స్ ను వర్షాకాలంలో తప్పనిసరిగా తినమని న్యూట్రీషనిస్ట్లు చెబుతున్నారు.

ఖర్జూరంలో తక్కువ శాతం గ్లైసీమిక్ ఇండెక్స్ ఉంటుంది. కనుక డయాబెటిసిన్ వ్యాధిగ్రస్తులకు మంచి పోషక పదార్ధం. పండు ఎక్కువ స్వీటుగా ఉంటుందని చాలామంది డయోబెటిస్ బాధితులు వీటికి దూరంగా ఉంటారు. అయితే వీళ్లు ఎండు ఖర్జూరం తింటే మరిన్ని ప్రయోజనాలను పొందొచ్చని అంటున్నారు.

ఖర్జూరం తినడంవల్ల కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గుతాయి. ఖర్జూరంలో ఫైబర్, పొటాషియం , ఐరన్ సమృద్ధిగా ఉంటుంది. రక్తహీనతతో బాధపడేవారికి మంచి ఆహారం ఇది. వర్షాకాలంలో ఖర్జూరం తినడం వలన నిద్రలేమి సమస్య ఉండదు. వ్యాయామం చేసేవారికి మంచి శక్తిని ఇస్తుంది. మలబద్దకం, ఎసిడిటీ సమస్యలను నివారిస్తుంది. ఖర్జూరం తినడం వల్ల హిమోగ్లోబిన్ లెవెల్స్ పెరుగుతాయి.

చాలా మంది డ్రై ఫ్రూట్స్ రెగ్యులర్ గా తింటూ ఉంటారు. అలాంటి వాళ్లు నానబెట్టిన ఎండు ఖర్జూరాన్ని కూడా తింటే శరీరానికి కావలసిన పోషకాలు అందుతాయి. సాధారణంగా వర్షాకాలం వచ్చిందంటేనే సీజనల్ వ్యాధులు విజృంభిస్తాయి. అందుకే రోజూ ఖర్జూరం తింటే రోగనిరోధక శక్తి పెరిగి సీజనల్ వ్యాధులకు చెక్ పెట్టొచ్చని డాక్టర్లు సూచిస్తున్నారు.

చిన్నపిల్లలు ప్రతిరోజూ ఖర్జూరం తినేలా అలవాటు చేయాలని చెబుతున్నారు. పండుగా తినడానికి ఇష్టపడకపోతే డ్రై ఫ్రూట్స్ లడ్డూలా చేసి అయినా తినిపిస్తే… చిన్నారులు యాక్టివ్ గా ఉండటంతో పాటు వారిలో ఇమ్యూనిటీ పెరుగుతుందని అంటున్నారు డాక్టర్లు.