ఏ వయసు వారు ఏ పాలు తాగాలో తెలుసా?

Do you know what age to drink milk,what age to drink milk,know what age to drink,Mango News,Mango News Telugu,Milk, cow milk , buffalo milk is better , drink milk,When Can Babies Start Drinking,When Can Babies Drink Milk,When Can Babies Have Milk,When Can Babies Drink Cows Milk,Feeding Your Baby,Age to Drink Milk Latest News,Age to Drink Milk Latest Updates,Age to Drink Milk Live News
Milk, cow milk , buffalo milk is better? , drink milk,

పిల్లల నుంచి మహిళల వరకూ ఎవరైనా  కాస్త నీర్సంగా కనిపిస్తే పెద్దలు చెప్పేమాట పాలు తాగమ్మా కుదటపడతావు అనే. పాలు పౌష్టికాహారం అని డాక్టర్లు కూడా చెప్పడంతో.. చిన్నప్పటి నుంచీ తమ పిల్లలకు ప్రతీ రోజూ పాలు తాగడాన్ని పెద్దవాళ్లు అలవాటు చేస్తారు. పాలులో ప్రోటీన్, కార్బోహైడ్రేట్, కొవ్వు, విటమిన్లు, ఖనిజాలు వంటి ఎన్నో  పోషకాలు ఉంటాయి. అయితే చాలామందికి ఆవు పాలు మంచివా, గేదెపాలు మంచివా అన్న అనుమానం వస్తుంటుంది.

నిజానికి ఆవు, గేదె పాలు రెండిటిలో కూడా పోషకాలు ఉంటాయి. ఇవి చిన్నపిల్లల నుంచి ముసలివాళ్లకు కావాల్సిన  పోషకాలను అందిస్తాయి. ముఖ్యంగా పాలల్లో ఉండే కాల్షియం  ఎముకలు, శరీర అభివృద్ధికి  పాలు చాలా అవసరం.  పిల్లలకు, వృద్ధులకు పాలు చాలా ముఖ్యమైన ఆహారంగా పెద్దలు చెబుతారు. అయితే ఆవు, గేదె పాలకు మధ్య స్వల్ప వ్యత్యాసం ఉందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.

ఆవు పాలలో ఎక్కువ మొత్తంలో ప్రోటీన్, కాల్షియం ఉంటాయి.ఇంకా చెప్పాలంటే ఆవు పాలు పిల్లలకు సరైన పోషకాహారమని డాక్టర్లు చెబుతూ ఉంటారు. ఎందుకంటే ఈ పాలు సులభంగా జీర్ణమవడంతో పాటు.. ప్రోటీన్లు సమృద్ధిగా ఉంటాయి. పైగా కొలెస్ట్రాల్ తక్కువగా ఉండటంతో లావు తగ్గాలనుకునేవాళ్లు గేదెపాలు కంటే ఆవు పాలు వాడటం మంచిది. గేదె పాలు చిక్కగా ఉంటాయి. గేదెపాలులో ఎక్కువ మొత్తంలో కొవ్వు, కేలరీలు, విటమిన్ ఎ, బి కాంప్లెక్స్, ఐరన్, పొటాషియం, మెగ్నీషియం మొదలైన పోషకాలతో నిండి ఉంటాయి. అంతేకాదు కడుపు సంబంధిత సమస్యల నుండి ఉపశమనాన్ని అందించడంలో గేదెపాలు సహాయపడతాయి.

ఆవు పాలలో ఉండే ప్రొటీన్ పరిమాణం.. గేదె పాల కంటే ఎక్కువగా ఉంటుందట. ఆవు పాలలో ప్రోటీన్ కంటెంట్ సుమారు 3.5శాతం ఉంటుంది. అయితే ఆవు పాలలో ఉండే ప్రోటీన్ సులభంగా జీర్ణమయిపోతుంది.   ఆవు పాలలోని ప్రోటీన్ అమైనో ఆమ్లాల పరంగా సమతుల్యంగా ఉండటంతో ఆహారం త్వరగా జీర్ణం అవుతుంది . గేదె పాలలో ప్రొటీన్ కంటెంట్ సుమారు 3.3శాతం, ఇది ఆవు పాల కంటే తక్కువ. ప్రోటీన్ కంటెంట్ పరంగా చూస్తే కనుక గేదె పాల కంటే ఆవు పాలు ఉత్తమమని ఆరోగ్య నిపుణులు చెబుతారు.  ఆవు పాలు పిల్లలకు, వృద్ధులకు మరింత మంచివి. అయితే గేదె పాలలో మొత్తం కొవ్వు పదార్థం ఆవు పాల కంటే ఎక్కువ ఉండటంతో.. కొవ్వు రహిత పాల కంటే గేదె పాలు శక్తిని అందించడంలో ప్రభావవంతంగా ఉంటాయని నిపుణులు అంటారు. పెద్దలకు అవసరమైన విటమిన్ ఎ, బి కాంప్లెక్స్  ఎక్కువగా ఉండటంతో..గేదెపాలు పెద్దలకు మరింత ప్రయోజనకరంగా ఉంటాయి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

20 + two =