హిందూ మతంలో సరస్వతిదేవిని జ్ఞానం, కళ, సంగీతానికి దేవతగా భావిస్తుంటారు. వసంత పంచమి రోజున సరస్వతిమాతను భక్తులు ఎక్కువగా కొలుస్తుంటారు. ఈ ఏడాది వసంత పంచమి ఎప్పుడు ఆరోజు ఏ సమయానికి చేసుకోవాలనే ప్రశ్న చాలామందిలో ఉంది. హిందూ మతంలో, మాఘ మాసాన్ని పండుగల మాసం అని పిలుస్తారు. వసంత పంచమి పండుగ కూడా ఈ మాసంలో వస్తుంది.
సరస్వతీ దేవి ఆరాధనకు అంకితం అయిన రోజు కాబట్టి..ఆ రోజు మాతను పూజిస్తే విద్యార్థుల నుంచి పెద్దల వరకూ సకల శుభాలు కలుగుతాయని అంటారు. ప్రతి సంవత్సరం వసంత పంచమిని మాఘ మాసంలోని శుక్ల పక్షం ఐదో రోజున జరుపుకొంటారు. ఈ రోజు సరస్వతి దేవి జన్మించిన పవిత్రదినంగా చెబుతారు. ఈ సందర్భంగా ఇళ్లు, దేవాలయాలు, విద్యాసంస్థల్లో కూడా సరస్వతీ పూజను ఘనంగా నిర్వహిస్తారు. సరస్వతిదేవిని విద్య, మేధస్సు, సంగీతం, సృజనాత్మకత దేవత అని పిలుస్తుంటారు. అమ్మవారిని ఆరాధించడం వల్ల విద్యార్థులలో కళా నైపుణ్యాలు మెరుగుపరిచి.. జ్ఞానాన్ని పెంచుతుంది ఆ సరస్వతి దేవి.
పంచాంగంలో ఉన్నదాని ప్రకారం, ఈ సంవత్సరం మాఘమాసంలోని శుక్ల పక్ష పంచమి తిథి ఫిబ్రవరి 2వ తేదీ, 2025 ఉదయం 9.14 గంటలకు ప్రారంభమయి..ఫిబ్రవరి 3వ తేదీ ఉదయం 6:52 గంటలకు ముగుస్తుంది. ఇటువంటి పరిస్థితిలో, ఉదయం ఉన్న తిథి ప్రకారం, వసంత పంచమి పండుగను 2వ తేదీ ఫిబ్రవరి 2025 న జరుపుకుంటారు. ఈ రోజు విద్యార్థులు ఆ దేవిని పూజించడం వల్ల వారిని అనుగ్రహిస్తుంది. ఈ సంవత్సరం పంచాంగం ప్రకారం, ఫిబ్రవరి 2వ తేదీ న ఉత్తరా భాద్రపద నక్షత్రం ఏర్పడుతుంది. దానిపైప శివ, సిద్ధ యోగాల కలయిక ఉంటుంది అలాగే ఈ తేదీలో సూర్యుడు మకరరాశిలో ఉంటాడు.