కిడ్నీలో రాళ్లు చేరడం వయసుతో పని లేకుండా చాలా మందిని బాధిస్తుంది. బ్లడ్ లో ఎక్కువ క్యాల్షియం ఉండడం లేదు అంటే కాల్షియం, విటమిన్-డి సప్లిమెంట్ ని ఎక్కువగా తీసుకోవడం, అధిక బరువు ఉండడం ఇలా వివిధ కారణాల వల్ల కిడ్నీలో రాళ్లు ఏర్పడతాయని నిపుణులు అంటున్నారు.కిడ్నీలో రాళ్లు మూత్రపిండాలకు తీవ్ర నష్టాన్ని కలిగిస్తాయి. అలాగే కిడ్నీలో రాళ్లు కాల్షియం ఆక్సలేట్‌తో తయారవుతాయి. అయితే ఈ రాళ్లు చిన్నవిగా ఉంటాయి కాబట్టి.. గుర్తించడం కష్టం. కానీ కొన్ని సందర్భాలలో, అవి శరీరాన్ని విడిచి మూత్రం ద్వారా విడుదల అవుతున్నప్పుడు, విపరీతమైన నొప్పిని కలిగిస్తాయి. అయితే వీటికి ఈ వంటింటి చిట్కాలతోనే ఉపశమనం లభిస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.
కిడ్నీలో స్టోన్స్ ఏర్పడితే అలోవెరా జ్యూస్ తాగితే సెట్ అయిపోతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు అలోవెరా జ్యూస్ తాగడం వల్ల మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడవని అంటున్నారు.అదే విధంగా ప్రతి రోజూ ఉదయాన్నే కొబ్బరి నీళ్లు తాగితే కిడ్నీ స్టోన్స్ తో పాటు ఇతర వ్యర్థాలు కూడా తొలగిపోతాయని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.ఖాళీకడుపుతో దానిమ్మ జ్యూస్ కానీ దానిమ్మ గింజలు కానీ తీసుకోవడం వల్ల కిడ్నీస్టోన్స్ తగ్గడానికి సహాయపడుతుంది.
ఆపిల్ సైడర్ వెనిగర్ తీసుకోవడం వల్ల కిడ్నీలో స్టోన్స్ ను బయటకు పంపడానికి వీలవుతుంది. అలాగే రణపాల ఆకు కూడా కిడ్నీ స్టోన్స్ కు చెక్ పెట్టడానికి బాగా ఉపయోగపడుతుంది. రణపాల ఆకులను అలాగే తిన్నా.. లేదా నీటిలో మరగబెట్టి ఆ నీటిని రోజంతా తాగినా మంచి ఫలితం ఉంటుంది.
ఇలా కనుక మీరు రెగ్యులర్ గా చేస్తే తప్పకుండా కిడ్నీ స్టోన్స్ సమస్య ఉండదని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. అదే విధంగా రోజూ కనీసం 3నుంచి 4 లీటర్ల నీళ్లు తాగేటట్టు చూసుకోవాలని సూచిస్తున్నారు.
నీటిలో కొద్దిగా నిమ్మరసం వేసుకుని దానిలో తేనె కాని బెల్లం కానీ కలుపుకుని ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం తీసుకుంటే కూడా కిడ్నీలో స్టోన్స్ కరిగిపోతాయి.
పుచ్చకాయ జ్యూస్ లేదా పుచ్చకాయ ముక్కలు తినడం వల్ల కూడా కిడ్నీలో స్టోన్స్ కరిగిపోతాయి. అలానే కిడ్నీలో స్టోన్స్ ఏర్పడితే కొద్దిగా నిమ్మరసంలో సైంధవలవణం కలుపుకుని తీసుకుంటే రాళ్లు కరిగిపోతాయి అని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు.తులసి ఆకుల్ని ఎండబెట్టి వేడినీటిలో వేసి ఆ టీని రోజుకి 3 సార్లు తీసుకుంటే మంచిది. ఇలా చేయడం వల్ల అది ఎసిటిక్ ఆమ్లంగా మారి కిడ్నీలో స్టోన్స్ ని తొలగించడానికి సహాయపడుతుంది.