ఇప్పుడు బర్డ్ ఫ్లూ భయం వల్ల చికెన్ లవర్స్ అంతా చేపలకు షిప్ట్ అయిపోయారు. నిజానికి చేపలు.. చికెన్, మటన్ కంటే కూడా మంచిదని తెలిసీ కూడా చాలామంది తినరు. కానీ ఇప్పుడు నాన్ లవర్స్ అంతా తప్పనిసరిగా చేపలే తింటూ జిహ్వ చాపల్యాన్ని చల్ల బరుచుకుంటున్నారు. చేపలలో విటమిన్ ఎ,డి,ఇ లతోపాటు, బలవర్ధకమైన కొవ్వు పదార్ధాలను కలిగి ఉంటాయి.
చేపలలో 18 నుంచి 20శాతం వరకు మాంసకృత్తులు ఉంటాయి. త్వరగా జీర్ణం అవ్వటంతో పాటు శరీరానికి అవసరమైన ఎనిమిది రకాల అమైనో యాసిడ్లు లభిస్తాయి.అయితే కొంతమంది చేపగుడ్లు ఇష్టంగా తింటారు. మరికొంతమంది అదేదో తినకూడని పదార్ధంగా చూస్తుంటారు. కాని అందులో శరీరానికి అవసరమైన పోషకాలు అధికంగా లభిస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా చేపగుడ్లు హార్ట్ ప్రాబ్లెమ్ ఉన్నవారికి ఎంతో మేలు చేస్తాయని అంటున్నారు.
చేపల కూర వండినట్లుగానే ఈ ఫిష్ ఎగ్స్ వండుకుని తినవచ్చు.రెగ్యులర్గా చేపగుడ్లను ఆహారంలో తీసుకుంటే బీపీ సమస్య క్రమంగా తగ్గుముఖం పడుతుంది. చేప గుడ్లలో విటమిన్ D కూడా ఉంటుంది. ఇది మీ ఎముకలు, దంతాలను బలంగా దృఢంగా మారుస్తుంది. ముఖ్యంగా గుండె జబ్బులు రాకుండా నివారిస్తుంది. తరచూ చేప గుడ్లు తినడం వల్ల హార్ట్ కు సంబంధించిన ఎటువంటి జబ్బులు రావని వైద్యులు చెబుతున్నారు.
చేప గుడ్లలో విటమిన్ A ఉంటుంది. ఈ విటమిన్ కంటి చూపును కాపాడటంలో ఎంతగానో తోడ్పడుతుంది. కళ్లకు ఎలాంటి హాని కలగకుండా చేస్తుంది. రెగ్యులర్గా చేప గుడ్లు తింటే రక్తంలో హిమోగ్లోబిన్ పెరుగుతుంది. రక్తం శుద్ధి అవుతుంది. రక్తహీనతతో బాధపడేవారికి చేపగుడ్లు తినటం వల్ల రక్తశాతం వెంటనే పెరుగుతుంది.
మతిమరపు సమస్య ఉన్నవారు, అల్జీమర్స్ పేషెంట్లు కూడా క్రమం తప్పకుండా చేప గుడ్లను తినటం వల్ల మంచి ఫలితం ఉంటుంది. రక్తపోటు సమస్య ఉన్నవారికి చేప గుడ్లు ఎంతో మేలు చేస్తాయి. బీపిని తగ్గించేందుకు ఉపయోగపడతాయి. చేపగుడ్లను కూర రూపంలోకాని , ప్రై రూపంలో కాని చేసుకుని తినొచ్చు. చేపల కూర చేస్తున్నపుడు దానిలో గుడ్లను కూడా వేసి కదపకుండా 5 నిమిషాలు ఉడికిస్తే ..ఫిష్ కర్రీతో పాటు చేపల గుడ్లు టేస్టీటేస్టీగా తినేయొచ్చు.