సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది, అందులో ఓ మహిళ మోకాళ్లపై కూర్చోబెట్టిన వ్యక్తిని చెప్పుతో కొడుతూ కనిపిస్తోంది. ఈ ఘటనను మరింత సంచలనంగా మారుస్తున్న అంశం ఏమిటంటే, ఆ మహిళ అస్సాం మాజీ ముఖ్యమంత్రి ప్రఫుల్ల కుమార్ మహంత కుమార్తె. మోకాళ్లపై కూర్చున్న వ్యక్తి ఆమె తండ్రి వద్ద డ్రైవర్‌గా పనిచేసే వ్యక్తిగా గుర్తించారు.
ఈ ఘటన అస్సాం రాజధాని దీస్పూర్లోని ఎమ్మెల్యే గెస్ట్ హౌస్‌లో చోటుచేసుకుంది. మహంత కుమార్తె వివరణ ఇచ్చిన ప్రకారం, ఆ డ్రైవర్ నిత్యం మద్యం మత్తులో ఉంటూ తనతో దురుసుగా ప్రవర్తించేవాడని ఆమె ఆరోపించారు. అతడిని పలుమార్లు హెచ్చరించినప్పటికీ, మార్పు లేకపోవడంతో చివరికి శారీరక దండనకు పాల్పడ్డానని ఆమె వెల్లడించారు. సోమవారం కూడా అతడు మద్యం సేవించి తన ఇంటి తలుపులు కొట్టాడని, దాంతో సహనం కోల్పోయి ఈ చర్యకు ఒడిగట్టానని చెప్పింది.
ఈ ఘటనపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సదరు డ్రైవర్‌పై ఇంతకాలం పోలీసులకు ఫిర్యాదు చేయకపోవడం ఎందుకు? అతడు ప్రభుత్వ ఉద్యోగినా లేదా వ్యక్తిగతంగా నియమించుకున్న వారనా? మహంత కుటుంబం ఇంకా ఎమ్మెల్యే క్వార్టర్లలో నివసించేందుకు అనుమతి ఎలా పొందింది? ఈ వివాదంపై మరింత స్పష్టత రావాల్సి ఉంది.
Shocking visuals emerge allegedly, showing former #Assam CM @PrafullaKumarMahanta’s daughter allegedly assaulting a staff member with a chappal. Such behavior is unacceptable and must be condemned. Authorities should take swift action! #Assam #viralvideo pic.twitter.com/P2kg75Va7i
— Afrida Hussain (@afridahussai) March 3, 2025