సోషల్ మీడియా వేదికగా హీరోయిన్ నయనతార ఓ సుదీర్ఘ సందేశం పంచుకుంది. ఆమె విడుదల చేసిన లేఖలో ఆసక్తికర విషయాలను పంచుకున్న నయన్.. లేడీ సూపర్ స్టార్ అనే పిలుపు తనను తన అభిమానులకు దూరం చేస్తుందని చెప్పింది. నయనతారగా గుర్తించడం, పిలవడమే తనకు ఎంతో ఇష్టం అని తెలిపింది.
తన జీవితం తెరిచిన పుస్తకం అని కష్టసమయాల్లో మీరు నాకెంతో తోడుగా ఉన్నారని నయన తార గుర్తు చేశారు. మీ అపరిమితమైన ప్రేమ మరవలేనిదని.. ప్రేమతో మీరిచ్చే బిరుదులు విలువైనవని. కానీ లేడీ సూపర్ స్టార్ అనే ట్యాగ్ మాత్రం వద్దని చెప్పేసింది. అలా పిలిపోయించుకోవడం తనకు ఇష్టం లేదని, ఆ లేఖలో నయన్ క్లియర్ కట్‌గా చెప్పింది.
కాగా నయనతార చేతిలో ఇప్పుడు అరడజనుకు పైగా సినిమాలు ఉన్నాయి. కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న టాక్సిక్ సినిమాలో నయనతార హీరో అక్క పాత్ర చేయడం విశేషం. కాకపోతే దానిలో నయన్ ది కీలకమైన పాత్ర కావడంతో ఒప్పుకున్నారట.
అయితే ఇప్పుడు తనను లేడీ సూపర్ స్టార్ అని పిలవొద్దని లేఖ విడుదల చేయడం హాట్ టాపిక్ అయింది.
మరోవైపు నయనతార జీవితం వివాదాలమయమే. కేరళకు చెందిన నయనతార ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా పరిశ్రమలో అడుగుపెట్టి పెద్ద స్టార్ గా ఎదిగింది. చంద్రముఖి, గజిని వంటి సినిమాలు స్టార్టింగ్ లోనే ఆమెను ఎక్కడో నిలబెట్టాయి. తెలుగులో నయనతార నటించిన లక్ష్మి, సింహ, అదుర్స్ వంటి చిత్రాలు మంచి విజయాలు అందుకోగా.. ఎన్టీఆర్, ప్రభాస్, చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జునలతో కూడా జతకట్టి బెస్ట్ ఫెయిర్ అన్పించుకుంది.
#Nayanthara penned a lengthy note asking fans and member of the media to stop referring to her as "Lady Superstar."🗞️#News pic.twitter.com/PoFyBIHvG9
— Filmfare (@filmfare) March 5, 2025