మళ్లీ పెరిగిన గోల్డ్, సిల్వర్ ధరలు..

బంగారం, వెండి ధరలు పరుగులు పెడుతూనే ఉన్నాయి. మనం కనీవినీ ఎరుగని రీతిలో అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం కొత్త రికార్డులు సృష్టిస్తోంది. గత ఏడాదికాలంలోనే పుత్తడి ‌ ధర ఏకంగా 38 శాతం పెరిగినట్లు మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.

నిజానికి బులియన్ మార్కెట్‌లోనే కాదు.. బంగారం, వెండికి ఎప్పుడూ డిమాండే ఉంటుంది. అంతర్జాతీయంగా జరుగుతున్న పరిణామాల ప్రకారం.. గోల్డ్ , సిల్వర్ ధరల్లో ఎప్పటికప్పుడు మార్పులు, చేర్పులు జరుగుతుంటాయి. ఒక్కోసారి పెరిగితే..మరికొన్ని సార్లు తగ్గుతూ ఉంటాయి. అయితే తగ్గే ధరల కంటే పెరిగే ధరలు ఎక్కువగా ఉండటంలో బంగారం ఎప్పటికప్పుడు ఆల్ టైమ్ రికార్డ్స్ క్రియేట్ చేస్తూనే ఉంటుంది.

తాజాగా బంగారం ధర స్వల్పంగా పెరగగా.. సిల్వర్ ధర భారీగా పెరిగి లక్షమార్కును దాటేసింది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 80,660 రూపాయలు ఉండగా.. 24 క్యారెట్ల పదిగ్రాముల గోల్డ్ ధర 87,990 రూపాయలుగా ఉంది. వెండి కిలో ధర 1,00,100 రూపాయలుగా ఉంది.

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల పుత్తడి ధర 80,660 రూపాయలు ఉండగా, 24 క్యారెట్ల ధర 87,990 రూపాయలుగా ఉంది. కాగా విశాఖపట్నం, విజయవాడలో కూడా ఇవే ధరలు ఉన్నాయి. మరోవైపు హైదరాబాద్‌‌లో కిలో సిల్వర్ ధర 1,09,100 రూపాయలు కాగా విశాఖ పట్నం, విజయవాడలో ఇదే ధర కొనసాగుతుంది. ఢిల్లీలో మాత్రం వెండ ధర 1,00,100 రూపాయలుగా ఉంది.