బెట్టింగ్ యాప్స్‌పై అనన్య నాగెళ్ల సూటి ప్రశ్న..

కొద్ది రోజుల నుంచి సోషల్ మీడియాలో బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేస్తున్న ఇన్‌ఫ్లుయెర్స్, సెలబ్రిటీలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. చిన్నా, పెద్దా అని తేడా లేకుండా సుమారు పాతిక మంది సెలబ్రిటీలపై ఇప్పటికే పోలీసులు కేసులు నమోదు చేసారు. వీరిలో కొంతమంది పోలీసు విచారణకు కూడా హాజరై తమ వివరణ ఇచ్చుకున్నారు.హీరోలు రానా దగ్గుబాటి, విజయ్ దేవరకొండ, సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్ మీద కూడా కేసులు నమోదు అవడంతో..వాళ్లు సోషల్ మీడియా వేదికగా వివరణ ఇస్తూ వీడియోలు రిలీజ్ చేసారు. అయితే ఇలా కేసు నమోదైన 25 మందిలో తెలుగు రాష్ట్రాలకు చెందిన హీరోయిన్ అనన్య నాగెళ్ల కూడా ఉంది.

అయితే అనన్య నాగెళ్ల అందరిలా తానూ వివరణ ఇచ్చే ప్రయత్నం చేయకుండా.. తిరిగి ప్రభుత్వాన్నే ప్రశ్నించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వ ప్రాపర్టీ అయిన మెట్రో ట్రైన్స్‌పై బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ జరుగుతున్నాయి, ఇలాంటి పరిస్థితులు ఇక్కడ ఉన్నప్పుడు బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేయడం తప్పని మాకెలా అర్థం అవుతుందంటూ ఇంస్టాగ్రామ్ లో ఆమె ఒక ఫోటో స్టోరీలో పెట్టడంతో..ఇది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

దీంతో అనన్య మాట్లాడిన దాంట్లో కూడా లాజిక్ ఉంది కదా అని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం నేరం అన్నప్పుడు, మెట్రో రైల్స్ పై బహిరంగంగా అలా ఎలా ప్రమోట్ చేయిస్తారని ప్రశ్నిస్తున్నారు. పోలీసులు కేవలం సినిమా వాళ్ళ మీదనే కేసులు నమోదు చేయిస్తారా?, మెట్రో యాజమాన్యంపై కూడా కేసులు వేయరా అని అడుగుతున్నారు. న్యాయం అందరికీ సమానంగా ఉండాలి కదా? మరి ప్రభుత్వం వీటిపై ఎందుకు ద్రుష్టి సారించలేదని క్వచ్ఛన్ చేస్తున్నారు మరి పోలీసులు దీనిపై ఎలా స్పందిస్తారో.. ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.