కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నియామక పరీక్షలు ప్రాంతీయ భాషల్లో కూడా నిర్వహించాలి

CM KCR Writes a Letter to PM Modi, CM KCR Writes a Letter to President, CM KCR Writes a Letters to President Ramnath Kovind, CM KCR writes to PM to conduct central govt exams, Exams For Central Govt Jobs, KCR Letter To President, Mango News Telugu, pm narendra modi, President, President Ramnath Kovind, Telangana CM KCR

భారత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ప్రధాని నరేంద్ర మోదీ లకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు వేర్వేరుగా లేఖలు రాశారు. ప్రధాని మోదీకి రాసిన లేఖలో యూపీఎస్సి, ఆర్ఆర్బి, నేషనలైజ్డ్ బ్యాంక్స్, ఆర్బీఐ, ఎస్ఎస్సి, డిఫెన్స్ సహా వివిధ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నియామక పరీక్షలను ప్రాంతీయ భాషల్లో కూడా నిర్వహించేలా చూడాలని కోరారు. ఈ పోటీ పరీక్షలను ప్రస్తుతం ఇంగ్లీష్ మరియు హిందీ భాషలలో మాత్రమే నిర్వహించడం వలన హిందీయేతర భాషలు మాట్లాడే రాష్ట్రాల నుండి మరియు ఇంగ్లీష్ మీడియం నేపధ్యం లేని విద్యార్థులు తీవ్రమైన ప్రతికూలతను ఎదుర్కుంటున్నారని పేర్కొన్నారు. దేశంలో అన్ని రాష్ట్రాలకు సమానమైన అవకాశాలు ఇచ్చే విధంగా ప్రాంతీయభాషల్లో కూడా పరీక్షలు నిర్వహించాలని ప్రధాని మోదీకి సీఎం కేసీఆర్ విజ్ఞప్తి చేశారు.

ఇక రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ కు రాసిన లేఖలో మాజీ ప్రధాని పీవీ నరసింహారావు జ్ఞాపకార్థం స్మారక తపాలా స్టాంప్‌నకు త్వరగా అనుమతివ్వాలని సీఎం కేసీఆర్ కోరారు. దేశ ప్రధానిగా మార్గదర్శక ఆర్థిక సంస్కరణలు మరియు హెచ్ఆర్ డెవలప్మెంట్, ఇంటర్నేషనల్ రిలేషన్స్, రూరల్ డెవలప్మెంట్, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఆర్ట్స్, కల్చర్ అండ్ లిటరేచర్ రంగంలో గణనీయమైన మార్పులు తీసుకొచ్చిన పీవీ నర్సింహరావు శత జయంతి ఉత్సవాలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తుందని తెలిపారు. శీతాకాలం విడిదిలో భాగంగా రాష్ట్రపతి హైదరాబాద్ కు వచ్చినపుడు పీవీ స్మారక తపాలా స్టాంప్‌ను ఆవిష్కరించాలని సీఎం కేసీఆర్ విజ్ఞప్తి చేశారు.

 

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here