కారును ఉపయోగించే సమయంలో కొన్ని విషయాలను కచ్చితంగా పాటించాలని నిపుణులు చెబుతున్నారు. చాలా మంది తెలిసో తెలియకో కొన్ని తప్పులు చేస్తుంటారు. ముఖ్యంగా కారులో ఏసీ ఉపయోగించే సమయంలో కొన్నిటి గురించి తెలుసుకోవాలి. చాలా మంది కారులో కూర్చున్న వెంటనే ఏసీ ఆన్ చేస్తుంటారు. అయితే ఇలా చేయడం వల్ల కొన్ని అనారోగ్య సమస్యలు ఎదురవుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
సాధారణంగా మనిషి శరీరం సాధారణ ఉష్ణోగ్రత కంటే కూడా కారు ఉష్ణోగ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది డ్రై నెస్ సమస్యకు దారి తీస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అలెర్జీ సమస్యలతో బాధపడేవారికి ఈ సమస్య మరింత ఎక్కువయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి కారులో కూర్చోగానే ఏసీ ఆన్ చేయకూడదని నిపుణులు చెబుతున్నారు.
సాధారణంగా చాలామంది కారు ఏసీ వెంట్స్‌ను రెగ్యులర్‌గా శుభ్రం చేసే వారి సంఖ్య చాలా తక్కువగానే ఉంటుంది. ఇలాంటపుడు వేడి భరించలేక కారులో కూర్చున్న వెంటనే ఏసీ ఆన్ చేస్తే ఆ డస్ట్ డైరక్టుగా ముక్కులోకి వెళ్లే ప్రమాదం ఉంటుంది. అందుకే కారు ఎక్కగానే ముందు ఏసీ ఆన్ చేయకూడదు.. ఒకవేళ ఏసీ ఆన్ చేస్తే మాత్రం కొద్ది క్షణాల పాటు విండోస్‌ను ఓపెన్ చేయాలి.
కారులో కూర్చున్న వెంటనే ముందుగా కారు విండోస్‌ను ఓపెన్ చేసి.. ఆ తర్వాతే ఏసీ ఆన్ చేయాలి. కారు ఇంటీరియర్‌లో ఉండే వస్తువులన్నీ కూడా ఫైబర్ లేదా ప్లాస్టిక్‌తోనే తయారు చేస్తారు. ఇవి హీటుకు గురైనప్పుడు బయటకు వచ్చే వాయువులు మనిషి ఆరోగ్యాన్ని పాడు చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. కారు ఎండలో ఉన్నప్పుడు ఇలాంటి సమస్య మరీ ఎక్కువ అవుతుంది. అందుకే కారు ఎక్కగానే ముందుగా విండోస్ అన్నీ ఓపెన్ చేసి లోపలి గాలంతా.. బయటకు వెళ్లాకే విండోస్ క్లోజ్ చేసి ఏసీ ఆన్ చేయాలి. లేదంటే అప్పుడు రిలీజయ్యే గ్యాస్ ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది.