ఆగని పసిడి పరుగులు

Unstoppable Gold Rush,Gold Continues To Perform At The Same Pace,Gold Price,Gold Price Today,Rising Gold Prices,Mango News,Mango News Telugu,Gold,Gold Price News,Gold Price Today Hike,Gold Rate In Hyderabad,Today Gold Rate,Gold Rate In India,Gold All Time Record,Gold Price Hike,Gold Surges By 18% In One Year,Gold Prices Latest,Gold Market,Gold Rates,Gold Rates Today,Gold Rates Today Hike, Gold Rates Hike

ఇప్పటికే ఆకాశాన్నంటున్న పసిడి ధరలు.. ఏప్రిల్‌ నెల ప్రారంభం నుంచే సరికొత్త రికార్డును సృష్టిస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ట్రేడ్ వార్ వల్ల ఏప్రిల్ 2వ తేదీ నుంచి సరికొత్త టారిఫ్ ప్లాన్లను ప్రకటిస్తానని చెప్పడంతో.. ఆర్థిక మార్కెట్లన్నింటిలోనూ భయం నెలకొంది. ఇప్పటికే స్టాక్ మార్కెట్లు కూడా ఏప్రిల్ 1నుంచి భారీ పతనం దిశగా వెళ్తున్నాయి. ఈ దెబ్బతో ఇటు బంగారం ధర కూడా కొండెక్కి కూర్చుంది.

భారతదేశంలో 24 క్యారెట్ల బంగారం ధర 9,285 రూపాయలు ఉండగా, 22 క్యారెట్ల బంగారం ధర 1 గ్రాము 8,511 రూపాయలుగా ఉంది. అలాగే, 18 క్యారెట్ల బంగారం ధర 1 గ్రాము 6,964రూపాయలుగా ఉంది. ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర 85,260 రూపాయలు ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర 93,000 రూపాయలుగా ఉంది.

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర 85,110 రూపాయలు ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర 92,850 రూపాయలుగా ఉంది. ముంబై, చెన్నై, కోల్ కతా, బెంగళూరు, విజయవాడ , విశాఖలలోనూ ఇదే ధరలు కొనసాగుతున్నాయి. మరోవైపు భారత్‌లో బంగారంతో పాటు వెండికి కూడా మంచి గిరాకీ ఉంటుంది. ప్రస్తుతం కిలో వెండి ధర 1,14,100 వద్ద కొనసాగుతుంది.