హెచ్సీయూ భూవివాదం రోజురోజుకీ ముదురుతోంది.ఓవైపు విద్యార్థులు తమ యూనివర్సిటీ భూమిని అన్యాక్రాంతం చేయొద్దని నిరసనలు చేస్తుంటూ మరోవైపు రాజకీయ నేతలు ఎంటర్ అయి వీరికి మద్దతునిస్తున్నారు. మరోవైపు పెద్ద ఎత్తున చెట్లని నరికేస్తూ..వణ్యప్రాణులు, పక్షులకి ఉండటానికి నీడ లేకుండా చేసే అభివృద్ధి తమకి వద్దంటూ పర్యావరణ, జంతు ప్రేమికులు ఫైర్ అవుతున్నారు.తాజాగా రేణూ దేశాయ్ మరోసారి తెలంగాణ ప్రభుత్వాన్ని ఈ విషయంపై రిక్వెస్ట్ చేస్తూ.. ఓ వీడియోని రికార్డ్ చేసి ఇన్స్టాగ్రామ్ వేదికగా వేడుకున్నారు.
తాజాగా ఈ వివాదంపై నటి రేణూ దేశాయ్ మరోసారి రియాక్టయ్యారు. నిన్న ఇన్స్టాగ్రామ్లో దీనిపై కొన్ని పోస్టులు పెట్టిన రేణూ.. ఈసారి ఒక వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ… దయచేసి ఆ 400 ఎకరాల్ని వదిలేయాలంటూ సీఎంని వేడుకున్నారు. మన సీఎం రేవంత్ రెడ్డి గారికి హృదయపూర్వకంగా చేస్తున్న ఓ విన్నపమని మొదలు పెట్టిన రేణు.తనకు రెండు రోజుల క్రితం HCU వివాదం గురించి తెలిసిందని చెప్పారు. కొన్ని విషయాలు కూడా అడిగి తెలుసుకున్నానని.. అందుకే ఈ వీడియో చేస్తున్నానని చెప్పారు. ఒక తల్లిగా తాను సీఎంను కోరుతున్నానన్న రేణు దేశాయ్..తనకు 44 ఏళ్లు వచ్చేశాయ్.. రేపో మాపో పోతానని.. కానీ తన పిల్లలతో పాటు అందరి పిల్లల భవిష్యత్తు మనకి ముఖ్యమని దీనికోసం ఆక్సిజన్ కావాలి.. నీళ్లు కావాలని చెప్పారు.
అయితే అభివృద్ధి అనేది 100 శాతం ముఖ్యమేనని.. అందులో ఎలాంటి అనుమానం లేదని. మనకి ఐటీ పార్క్స్, ఎత్తైన భవనాలు అన్నీ కావాలని చెప్పారు రేణు. కానీ ఒక్క శాతం వీలైనా సరే ఆ 400 ఎకరాల్ని మాత్రం వదిలేయండంటూ కోరారు. ఈ రాష్ట్రానికి చెందిన పౌరురాలిగా మిమ్మల్ని వేడుకుంటున్నానని…. దయచేసి దీన్ని వదిలేయండని అన్నారు. మనకి కావాలంటే చాలా ఖాళీ ప్రదేశాలు ఉన్నాయన్న ఆమె.. వాటిని అభివృద్ధి చేయండని చెప్పారు. సీఎంకు చెప్పేటంత స్థాయి తనకు లేదని.. వారి ముందు తాను చాలా చిన్నదాన్ని అని చెప్పుకొచ్చారు.
ఒక నగరం అభివృద్ధి చెందడం వల్లే మనమంతా ఇక్కడ ఉన్నామని చెప్పిన రేణు దేశాయ్… కానీ ఆ 400 ఎకరాలు మాత్రం వదిలేయండని రిక్వెస్ట్ చేశార. మనకి ఆక్సిజన్, చెట్లు, నీళ్లు, జీవ వైవిధ్యం అంతా చాలా ముఖ్యమన్నారు. ఒకసారి పునరాలోచించాలని… అధికారులు, మంత్రులు, ప్రభుత్వం దయచేసి ఈ విషయాన్ని పరిశీలించాలని కోరారు. ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటే సీఎంకు ఎప్పటికీ రుణపడి ఉంటానంటూ రేణూ దేశాయ్ స్పెషల్ రిక్వెస్ట్ చేశారు.
View this post on Instagram