డ్ర‌గ్స్ కేసులో మంత్రి కేటీఆర్‌పై ఎలాంటి వ్యాఖ్య‌లు చేయొద్దు, రేవంత్‌రెడ్డికి సిటీ సివిల్ కోర్టు ఆర్డర్స్

City Civil Court, City Civil Court Gives Injunction Order to Directing Revanth Reddy, City Civil Court Gives Injunction Order to Directing Revanth Reddy not to Speak Linking KTR with Drugs Case, City Civil court issues notice to Revanth Reddy, Court restrains Revanth from dragging KTR’s name in drugs, Court restrains Revanth from linking KTR to drug scandal, KTR files defamation case against Telangana Congress chief, Mango News, Restraining order issued against Revanth, Revanth linking KTR to drug scandal, Revanth Reddy not to Speak Linking KTR with Drugs Case

డ్రగ్స్ కేసులో తనపై ఆరోపణలు చేస్తూ, తన ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నారంటూ తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ సిటీ సివిల్ కోర్టులో పరువునష్టం దావా వేసిన సంగతి తెలిసిందే. తనపై చేసిన వ్యాఖ్యల పట్ల బేషరతుగా క్షమాపణలు చెప్పేలా ఆదేశాలు ఇవ్వాలని సిటీ సివిల్ కోర్టును మంత్రి కేటీఆర్ కోరారు. ఈ నేపథ్యంలో మంత్రి కేటీఆర్ వేసిన పరువునష్టం దావా పిటిషన్ పై సిటీ సివిల్ కోర్టు మంగళవారం విచారణ చేపట్టింది. విచారణ అనంతరం డ్ర‌గ్స్ కేసు, ఈడీ కేసుల‌కు సంబంధించి మంత్రి కేటీఆర్‌పై ఎలాంటి వ్యాఖ్య‌లు చేయవ‌ద్ద‌ని రేవంత్‌రెడ్డికి సిటీ సివిల్ కోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఈ మేరకు సిటీ సివిల్ కోర్టు ఇంజంక్షన్ ఉత్తర్వులు ఇచ్చింది. అలాగే కేటీఆర్ ప‌రువు న‌ష్టం దావాపై తదుపరి విచారణను అక్టోబ‌ర్ 20న నిర్వహించనున్నట్టు సిటీ సివిల్ కోర్టు తెలిపింది.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × four =