బర్డ్ ఫ్లూతో బాలిక మృతి.. కారణం అదేనా?

Girl Dies Of Bird Flu Is That The Reason,Mango News,Mango News Telugu,A Sporadic Case,Aiims Doctors,Bird Flu,Girl Dies Of Bird Flu,Influenza Subtype Influenza,Fatal H5N1 case reported in India's Andhra Pradesh state,Fatal H5N1 case,Bird Flu News,Bird Flu Latest News,Bird Flu Updates,Bird Flu Live Updates,Bird Flu In AP,First Human Death From Bird Flu In Andhra Pradesh,2 Year Old Girl Dies Due To Bird Flu In Andhra,Andhra Pradesh News,Andhra Pradesh Latest News,AP,AP News,AP Latest News,Andhra Pradesh,Bird Flu In Andhra Pradesh,Andhra Pradesh Bird Flu News,Bird Flu In Andhra,Bird Flu In AP

రెండేళ్ల చిన్నారి బర్డ్‌ఫ్లూతో చనిపోవడం.. దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. బర్డ్‌ఫ్లూతో తొలి మరణ సంభవించడంతో అంతా అలెర్ట్‌ అయ్యారు. చిన్నారి మరణంపై అధ్యాయం జరపడానికి గురువారం అంటే ఏప్రిల్‌ 3న నరసరావుపేటలో కేంద్ర వైద్య బృందం పర్యటించనుంది. రెండేళ్ల చిన్నారి బర్డ్ ఫ్లూతో మరణించడానికి గల కారణాలపై ఈ బృందం అధ్యయనం చేయబోతోంది.

ఢిల్లీలోని నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ నుంచి ముగ్గురు, ముంబై నుంచి ఒకరు, మంగళగిరి ఎయిమ్స్ నుంచి ఒకరు నరసరావుపేటలో పర్యటించనున్నారు. ఇప్పటికే మంగళరిగి ఎయిమ్స్‌ వైద్యులు బాలికకు సన్నిహితంగా ఉన్న తొమ్మిది మంది నుంచి, దగ్గరలోని చికెన్ దుకాణాల వారి రక్త నమూనాలను కూడా సేకరించి పరీక్షలు నిర్వహించారు. వారిలో ఎవరికీ కూడా వైరస్ సోకినట్టు నిర్ధారణ అవలేదు. అంతేకాదు బర్డ్ ఫ్లూ మరణం తరువాత ఈ తరహా కొత్త కేసులేవీ నమోదు కాలేదని కూడా మంగళగిరి ఎయిమ్స్ ప్రకటించింది.

ఇన్ఫ్లూయెంజా ఉప రూపాంతరమైన ఇన్ఫ్లూయెంజా- ఏ స్పొరాడిక్ కేసుగా దీన్ని ఎయిమ్స్‌ వైద్యులు గుర్తించారు. ఇది వ్యాప్తి చెందేది కాదని..ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వెల్లడించారు. అయితే మృతి చెందిన చిన్నారికి బర్డ్ ఫ్లూతో పాటు లెప్టోస్పైరోసిస్ ఉన్నట్టు ఎయిమ్స్ వైద్యులు నిర్ధారించారు. బాలిక ఇంటి పరిసర ప్రాంతల్లో ఎలుకలు ఎక్కువగా ఉండటం వల్ల లెప్టోస్పైరోసిస్ సోకి ఉండొచ్చని వీరు అభిప్రాయపడుతున్నారు. ఎయిమ్స్ వైద్యుల అభిప్రాయాన్ని కేంద్ర వైద్య బృందం కూడా నిర్ధారిస్తుందో లేదో అన్న విషయం వీరి అద్యయనం చేసిన తర్వాత మరింత తెలుస్తుంది.