ఇప్పుడు చాలా మందికి గ్యాస్ సమస్య కామన్ అయిపోయింది. అయితే కొన్ని సింపుల్ చిట్కాలతో గ్యాస్ ప్రాబ్లెమ్‌కు చెక్ పెట్టొచ్చని నిపుణులు అంటున్నారు. వేసవిలో శరీరానికి చల్లదనాన్ని అందించడమే కాకుండా జీర్ణ వ్యవస్థకు మజ్జిగ చాలా మంచిది. మజ్జిగలో ఉండే ప్రోబయోటిక్స్, లాక్టిక్ యాసిడ్ వంటి పదార్థాలు మంచి బాక్టీరియాను పెంచుతాయి. దీనివల్ల ఆహారం సరిగ్గా జీర్ణం అవడంతో పాటు.. ఇది కడుపులోని మంటను తగ్గిస్తుంది. అలాగే గ్యాస్ పేరుకుపోవకుండా చేస్తుంది. అందుకే ప్రతిరోజూ మజ్జిగలో తేనె లేదా జీలకర్ర పొడి కలిపి తాగితే మంచిది.
జీలకర్రలో ఉండే యాంటీ-ఇన్ఫ్లమేటరీ గుణాలు జీర్ణ సమస్యలను తగ్గించడంలో సహాయపడతాయి. జీలకర్ర నీటిని ప్రతి రోజు ఉదయాన్నే తాగితే, జీర్ణవ్యవస్థ బలంగా ఉండి పొట్ట ఉబ్బరం రాదు. ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో ఒక చెంచా జీలకర్ర పొడి కలిపి రోజూ తాగితే గ్యాస్ సమస్య తక్కువగా ఉంటుంది.అలాగే అల్లం సహజమైన జీర్ణ సహాయకంగా పని చేస్తుంది. ఇది పొట్టలో మంటను తగ్గించడంతో పాటు, గ్యాస్ సమస్య నుంచి ఉపశమనం అందిస్తుంది. నీటిలో కొన్ని అల్లం ముక్కలు వేసి మరిగించి ఆ నీటిని ఉదయాన్నే తాగితే గ్యాస్ సమస్యకు చెక్ పెట్టొచ్చు.
గ్యాస్ సమస్య తగ్గించడంలో యాపిల్ సైడర్ వెనిగర్ అద్భుతంగా పని చేస్తుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది కాబట్టి… ఉదయం లేవగానే ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో ఒక స్పూన్ యాపిల్ సైడర్ వెనిగర్ కలిపి తాగితే అజీర్తి, గ్యాస్ సమస్య తగ్గిపోతాయి. ఇది శరీరంలో పిహెచ్ బ్యాలెన్స్‌ను మెరుగుపరుస్తాయి.
పుదీనా ఆకుల్లో ఉండే యాంటీ-స్పాస్మోడిక్ గుణాలు వల్ల కడుపులోని మంట, ఉబ్బరం, గ్యాస్ సమస్యలు తగ్గుతాయి. ప్రతిరోజూ ఉదయం కొన్ని పుదీనా ఆకులను నమిలినా లేదా పుదీనా టీ తాగినా వెంటనే ఉపశమనం పొందొచ్చు. హెర్బల్ టీ వల్ల గ్యాస్ సమస్యలను తగ్గుతాయి. మెంతులు, అల్లం, తులసి, పుదీనా, చామంతి వంటి మూలికలతో చేసిన టీ జీర్ణవ్యవస్థను మెరుగుపరిచే గుణాలను కలిగి ఉంటాయి.
మెంతులలో యాంటీ-ఇన్ఫ్లమేటరీ, యాంటీ-ఆక్సిడెంట్ గుణాలు అధికంగా ఉండటంతో ఇది జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. మెంతులు శరీరంలోని హార్మోన్లను బ్యాలెన్స్ చేస్తాయి. దీంతో పాటు, పొట్టలో మంట,గ్యాస్ సమస్యలను తగ్గిస్తాయి. రాత్రిపూట మెంతులను నానబెట్టుకుని ఉదయాన్నే వాటిని తినటం లేదా మెంతి నీటిని తాగితే మంచిది. షుగర్ పేషెంట్లకు కూడా ఇది మంచిది.