ప్రజల రక్షణ కోసం తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టేది పోలీసులే – సీఎం చంద్రబాబు

CM Chandrababu Pays Tribute To Police Martyrs at AP Police Commemoration Day Parade

ప్రజల రక్షణ కోసం తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టేది పోలీసులేనని పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. నేడు ఆయన మంగళగిరిలోని 6వ బెటాలియన్‌లో జరిగిన పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర హోంమంత్రి అనిత, సీఎస్ విజయానంద్‌, డీజీపీ హరీశ్‌కుమార్‌ గుప్తా తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించి, ‘అమరులు వారు’ అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ప్రసంగిస్తూ పోలీసుల సేవలు, త్యాగాలను కొనియాడారు సీఎం చంద్రబాబు.

అమరవీరులకు నివాళులు – కుటుంబాలకు సెల్యూట్:

– 1959 అక్టోబర్‌ 21న చైనా సైనికులపై పోరాడి అమరులైన 10 మంది సీఆర్‌పీఎఫ్ దళాల త్యాగాలను స్మరించుకుంటూ ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు సీఎం తెలిపారు.
– ఈ ఏడాది దేశవ్యాప్తంగా విధి నిర్వహణలో 192 మంది పోలీసులు అమరులయ్యారని, వారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు.
– ప్రజల కోసం తమ సంతోషాన్ని త్యాగం చేసి, పోలీసులకు సహకరిస్తున్న వారి కుటుంబసభ్యులకు సీఎం సెల్యూట్ చేశారు.
– పోలీసులంటే కఠినంగా ఉంటారనుకుంటారు, కానీ మానవత్వంతో వ్యవహరించేది వాళ్లేనని పేర్కొన్నారు (ఉదాహరణకు, విజయవాడలో పిల్లలకు చెప్పులు కొనిచ్చిన హెడ్‌కానిస్టేబుల్ సంఘటనను గుర్తుచేశారు).

శాంతిభద్రతలు – సాంకేతిక బలోపేతం:

– సమాజంలో అలజడులు ఉంటే పెట్టుబడులు రావని స్పష్టం చేస్తూ, శాంతిభద్రతల విషయంలో రాజీ పడకుండా పనిచేయాలని పోలీసులకు దిశానిర్దేశం చేశారు.
– పోలీసు శాఖను సాంకేతికంగా బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని, సీసీ కెమెరాలు, డ్రోన్లు, గూగుల్ టేక్ అవుట్‌లను విస్తృతంగా ఉపయోగించుకోవాలని సూచించారు. సీసీ కెమెరాలు పోలీసు యంత్రాంగానికి మూడో కన్నులా పనిచేస్తాయని పేర్కొన్నారు.
– క్రిమినల్స్ సైబర్ టెక్నాలజీలో అప్‌డేట్ అవుతున్నందున, వారి కంటే ముందుండి నేరాలను కట్టడి చేయాలని ఆదేశించారు.

కఠిన చర్యలు – రాజకీయ కుట్రలపై దృష్టి:

– రస్థులపై కఠినంగా ఉండాలని, వారి గుండెల్లో రైళ్లు పరుగెత్తాలని సీఎం ఆదేశించారు.
– రాజకీయ ముసుగులో కొత్త నేరాలు, ఫేక్ ప్రచారాలు, కుల, మతాల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం జరుగుతోందని, సోషల్ మీడియా ఒక పెద్ద ఛాలెంజ్‌గా మారిందని వ్యాఖ్యానించారు.
– పోలీసులకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చామని, ప్రభుత్వానికి, ప్రజలకి అండగా ఉండాలని కోరారు.

సంక్షేమ కార్యక్రమాలు:

– పోలీసులకు బీమా కల్పించి అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామని తెలిపారు.
– హోంగార్డులకు హెల్త్ ఇన్సూరెన్స్ ఇస్తామని హామీ ఇచ్చారు.
– 6,100 మంది కానిస్టేబుళ్లను నియమించామని వెల్లడించారు.
– 2047 నాటికి దేశంలో ఏపీ నంబర్ 1గా ఉండాలంటే, అన్ని రకాల భద్రత ఉంటేనే సాధ్యమని ముఖ్యమంత్రి పునరుద్ఘాటించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here