కేంద్ర హోంమంత్రికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

AP CM Chandrababu and Dy CM Pawan Kalyan Extends Birthday Greetings To Union Home Minister Amit Shah

కేంద్ర హోంమంత్రి మరియు సహకార శాఖ మంత్రి అమిత్ షా గారు నేడు జన్మదినం జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా పలువురు రాజకీయ నాయకులు అమిత్ షా కి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మరియు ఉప ముఖ్యమంత్రి, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు వీరు సోషల్ మీడియా వేదికగా ప్రత్యేక పోస్టులు పెట్టారు.

సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు:

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోషల్ మీడియా వేదికగా అమిత్ షా గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ పోస్ట్ చేశారు. అమిత్ షా గారికి భగవంతుడు ఆయురారోగ్యాలను, సుదీర్ఘ జీవితాన్ని ప్రసాదించాలని కోరుకున్నారు. దేశ పురోగతి కోసం ఆయన నిరంతరం అందిస్తున్న సేవలు మరింత కొనసాగాలని ఆకాంక్షించారు.

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు:

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా అమిత్ షా గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. జాతీయ రాజకీయాల్లో ఆయన కీలక పాత్ర పోషిస్తున్నారని కొనియాడారు. ప్రజా సేవలో అమిత్ షా గారికి మరింత శక్తిని, ప్రేరణను లభించాలని ఆకాంక్షిస్తూ, ఆయన ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలని కోరుకున్నారు.

శుభాకాంక్షలు తెలిపిన మంత్రి నారా లోకేష్:

అలాగే మంత్రి నారా లోకేష్ సైతం ఎక్స్ వేదికగా.. “శ్రీ అమిత్ షా జీకి హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు. సర్, మీకు మంచి ఆరోగ్యం, దీర్ఘాయుష్షు మరియు దేశ సేవలో నిరంతర శక్తిని కోరుకుంటున్నాను. పాలన మరియు జాతీయ భద్రత పట్ల మీ అంకితభావం మనందరికీ స్ఫూర్తినిస్తూ ఉండాలని కోరుకుంటున్నాను.” అని పేర్కొన్నారు.

అమిత్ షాకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు చెప్పిన కూటమి నేతలు:

ఇక కేంద్రంలో, రాష్ట్రంలో అధికారం పంచుకుంటున్న నేపథ్యంలో కూటమి పార్టీల (తెలుగుదేశం, జనసేన, బీజేపీ) కీలక నేతలు కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలపడం ప్రాధాన్యత సంతరించుకుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here