తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గంలోకి కొత్తగా ఎంట్రీ ఇచ్చిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మొహమ్మద్ అజారుద్దీన్‌కు ప్రభుత్వం శాఖలను కేటాయిస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 31వ తేదీన ఆయన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రమాణ స్వీకారం జరిగిన నాలుగు రోజుల తర్వాత ఆయనకు కీలకమైన శాఖల బాధ్యతలను అప్పగించడం జరిగింది.
కాగా, మంత్రి అజారుద్దీన్‌కు కేటాయించిన శాఖలలో మైనార్టీ సంక్షేమ శాఖ (Minority Welfare) ముఖ్యమైనది. దీంతో పాటు, పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ శాఖ (Public Enterprises) బాధ్యతలను కూడా ఆయనకు అప్పగించింది రేవంత్ సర్కార్. ఈ కేటాయింపుతో రాష్ట్ర కేబినెట్లోని మంత్రుల సంఖ్య 15కు చేరింది. అయితే, నిబంధనల ప్రకారం భర్తీ చేయాల్సిన మరో రెండు మంత్రి పదవులు ప్రస్తుతం ఖాళీగా ఉన్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.త్వరలోనే వీటిని కూడా భర్తీ చేయనున్నట్టు తెలుస్తోంది.




































