తెలంగాణ రాష్ట్రంలో మే 20, బుధవారం నాటికీ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1661 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. కొత్తగా జీహెఛ్ఎంసీ ఏరియాలో 15 మందికి, వలస వచ్చిన వారిలో 12 మందితో కలిపి మొత్తం 27 కరోనా కేసులు నిర్ధారణ అయినట్టు తెలిపారు. ఈ వైరస్ వలన ఇవాళ ఇద్దరు మరణించడంతో రాష్ట్రంలో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 40 కి చేరింది. అలాగే 1013 మంది ఈ వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారని తెలిపారు. ప్రస్తుతం 608 మంది కరోనా బాధితులు ఐసొలేషన్ వార్డుల్లో చికిత్స పొందుతున్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu