బీహార్‌లో రేపు రెండో దశ పోలింగ్‌.. 122 అసెంబ్లీ స్థానాల్లో ఏర్పాట్లు పూర్తి

Bihar Elections 2025 Second Phase Polling in 122 Assembly Seats Tomorrow

బీహార్‌లో రాజకీయ వేడి కొనసాగుతోంది. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా రెండో దశ పోలింగ్‌ కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ ఎన్నికల్లో తొలి విడత పోలింగ్‌ నవంబర్‌ 6న ప్రశాంతంగా పూర్తైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పుడు రెండో విడత పోలింగ్‌ నవంబర్‌ 11న (మంగళవారం) జరగనుంది.

పోలింగ్ వివరాలు, భద్రతా ఏర్పాట్లు:

పోలింగ్ స్థానాలు: 243 అసెంబ్లీ స్థానాలకు గానూ, తొలి దశలో 121 స్థానాలకు పోలింగ్ జరిగింది. ఇప్పుడు రెండో దశలో 122 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరగనుంది.

పోలింగ్ కేంద్రాలు: మొత్తం 45,399 పోలింగ్ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. వీటిలో 40,073 పోలింగ్‌ కేంద్రాలు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాయి.

అభ్యర్థులు: రెండవ దశలో మొత్తం 1,302 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వీరిలో 136 మంది (దాదాపు 10 శాతం) మహిళా అభ్యర్థులు ఉన్నారు.

భద్రత, సిబ్బంది: పోలింగ్‌ నేపథ్యంలో బీహార్‌ వ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు. దాదాపు 4 లక్షలకుపైగా సిబ్బంది ఎన్నికల విధుల్లో ఉన్నట్లు అధికారులు సోమవారం తెలిపారు.

ప్రాంతాలు: రెండవ దశలో పోలింగ్‌ జరగనున్న 122 స్థానాలు బీహార్‌లోని మధ్య, పశ్చిమ, ఉత్తర ప్రాంతాల్లో ఉన్నాయి.

ముఖ్యమైన ప్రాంతాలు:

బీజేపీ, జేడీయూ: బీజేపీకి సంప్రదాయకంగా తిర్హుత్‌, సారణ్‌, ఉత్తర మిథిలాంచల్‌ ప్రాంతాలలో మంచి పట్టు ఉంది. బీజేపీ మిత్రపక్షమైన జేడీయూకు భాగల్‌పూర్‌ ప్రాంతంలో మంచి ఆదరణ ఉంది.

మహాఘట్ బంధన్: ఇక విపక్ష మహాఘట్‌బంధన్‌కు మగధ్‌ ప్రాంతంలో బలమైన పునాది ఉంది. ఈ ప్రాంతం పరిధిలో గయ, ఔరంగాబాద్‌, నావడ, జెహనాబాద్‌, అర్వాల్‌ ఉన్నాయి. ఈ ప్రాంతంలో కాంగ్రెస్ తన మిత్రపక్షాల బలంపైనే ఆధారపడింది.

ఓట్ల లెక్కింపు: రెండు దశలకు కలిపి నవంబర్‌ 14న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here