జూబ్లీహిల్స్ ఉపఎన్నిక: కౌంటింగ్ ప్రారంభం, రిజల్ట్స్ లైవ్ అప్డేట్స్

Jubilee Hills By-Poll Counting Begins, Cong, BRS and BJP Await Final Result

ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నిక ఫలితాలు ఈరోజు (శుక్రవారం, నవంబర్ 14, 2025) మరికొన్ని గంటల్లో వెలువడనున్నాయి. యూసుఫ్‌గూడలోని కోట్ల విజయభాస్కర్‌రెడ్డి ఇండోర్‌ స్టేడియం వేదికగా ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం అయింది.

  • 25వేల ఓట్లకు పైగా మెజారిటీతో విజయం సాధించారు.
  • ముగిసిన ఆఖరి (10వ) రౌండ్ కౌంటింగ్.
  • భారీ ఆధిక్యం దిశగా దూసుకుపోతోన్న అధికార కాంగ్రెస్.
  • అన్ని రౌండ్లలో ఆధిక్యం ప్రదర్శిస్తోన్న కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్.
  • 9 రౌండ్లు పూర్తయ్యేసరికి ఆయన 23వేలకు పైగా ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.
  • 9వ రౌండ్‌లో కాంగ్రెస్‌కు 2,117 ఓట్ల ఆధిక్యం.
  • రెండో స్థానంలో కొనసాగుతున్న బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత.
  • 8వ రౌండ్‌ తర్వాత 19,619 ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్‌
  • మరోవైపు కౌంటింగ్ కేంద్రం నుండి వెళ్లిపోయిన బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి.
  • ఏడో రౌండ్ లోనూ కాంగ్రెస్ స్పష్టమైన ఆధిక్యం.
  • 6వ రౌండ్‌లో కాంగ్రెస్ 2938 లీడ్ సాధించింది.
  • ఐదో రౌండ్‌ 3,178 ఓట్ల ఆధిక్యం.
  • నాల్గవ రౌండ్ – 3547
  • మూడవ రౌండ్ – 2843
  • రౌండవ రౌండ్ – 2995
  • మొదటి రౌండ్ – 47
  • ఈ ఎన్నికలో బీజేపీ కనీస పోటీ ఇవ్వలేకపోవడం గమనార్హం.

ఓట్ల లెక్కింపు వివరాలు:

రౌండ్లు: ఈ ఉప ఎన్నికలో మొత్తం 58 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నందున, కౌంటింగ్‌ను 10 రౌండ్లలో పూర్తి చేయనున్నారు.

ఫలిత సమయం: ఒక్కో రౌండ్‌ ఫలితానికి కనీసం 40 నిమిషాలు పట్టే అవకాశం ఉన్నందున, మధ్యాహ్నం 2 గంటలకల్లా తుది ఫలితం వెలువడే అవకాశం ఉందని జిల్లా ఎన్నికల అధికారి ఆర్వీ కర్ణన్ వెల్లడించారు.

భద్రత: లెక్కింపు కేంద్రం వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సెక్షన్ 144 అమలులో ఉంటుంది.

రాజకీయ విశ్లేషణ:

పోటీ: ఈ ఉప ఎన్నిక కాంగ్రెస్ (నవీన్ యాదవ్), భారాస (మాగంటి సునీత), భాజపా (లంకల దీపక్ రెడ్డి) మధ్య త్రిముఖ పోరుగా మారింది.

ఉత్కంఠ: ఈ ఎన్నిక రాజకీయ పార్టీలకు ప్రతిష్ఠాత్మకంగా మారింది. 48.49 శాతం అతి తక్కువ పోలింగ్ శాతం నమోదు కావడంతో గెలుపుపై ఉత్కంఠ నెలకొంది.

అంచనాలు: ఎగ్జిట్ పోల్స్ అన్నీ అధికార కాంగ్రెస్‌కు 6 నుంచి 9 శాతం వరకు ఆధిక్యం వస్తుందని అంచనా వేస్తున్నప్పటికీ, సిట్టింగ్ స్థానం తమకే దక్కుతుందని భారాస విశ్వాసం వ్యక్తం చేస్తోంది. కాగా, ఈ ఉపఎన్నికలో విజేతగా నిలవాలంటే సదరు అభ్యర్థి సుమారు 97 వేల ఓట్లు సాధించాల్సి ఉంటుంది. విజేత ఎవరనేది కొద్దిసేపట్లోనే తేలనుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here