ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బుధవారం (నవంబర్ 19, 2025) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యటనకు విచ్చేశారు. పర్యటనలో భాగంగా ఆయన శ్రీ సత్యసాయి జిల్లాలోని పుట్టపర్తిలో జరుగుతున్న దివంగత ఆధ్యాత్మిక గురువు సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక స్టాంపు మరియు నాణెం విడుదల చేశారు. అంతకుముందు ప్రధానికి సీఎం చంద్రబాబు మరియు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వాగతం పలికారు.
Honoured to welcome Hon'ble Prime Minister Shri @narendramodi Ji to Puttaparthi as he joins Bhagawan Sri Sathya Sai Baba's centenary celebrations. Looking forward to immersing myself in the divinity of this sacred place and recalling Bhagawan's immense contribution to the region… pic.twitter.com/U6rEt0pdEa
— N Chandrababu Naidu (@ncbn) November 19, 2025
పుట్టపర్తిలో గౌరవ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారికి ఘన స్వాగతం పలికిన ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు pic.twitter.com/ZUAUSMRg8Z
— I & PR Andhra Pradesh (@IPR_AP) November 19, 2025
ప్రధాని పర్యటన వివరాలు..
దర్శనం: ప్రధాని మోదీ బుధవారం ఉదయం పుట్టపర్తి చేరుకొని తొలుత ప్రశాంతి నిలయంలో సత్యసాయి మహాసమాధిని దర్శించుకున్నారు.
కార్యక్రమం: అనంతరం హిల్ వ్యూ స్టేడియంలో నిర్వహించే సత్యసాయి శత జయంతి ఉత్సవాల సభలో పాల్గొని సాంస్కృతిక కార్యక్రమాలను వీక్షించారు.
ప్రముఖుల హాజరు: ఇక ఈ కార్యక్రమంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేశ్ సహా పలువురు కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
అలాగే దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్, బాలీవుడ్ ప్రముఖ నటి ఐశ్వర్యా రాయ్ కూడా హాజరై కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
భద్రత: ప్రధాని పర్యటన నేపథ్యంలో సత్యసాయి విమానాశ్రయం నుంచి ప్రశాంతి నిలయం, హిల్ వ్యూ స్టేడియం వరకు భారీ భద్రతా చర్యలు చేపట్టారు.
ఇతర ప్రముఖుల రాక (నెల 22న)..
ఈ నెల 22న జరగనున్న వేడుకలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్, సీఎం చంద్రబాబు, పలు రాష్ట్రాల గవర్నర్లు, ముఖ్యమంత్రులు, కేంద్ర, రాష్ట్ర మంత్రులు కూడా పుట్టపర్తికి రానున్నారు.






































