బీహార్ ముఖ్యమంత్రిగా జనతాదళ్ యునైటెడ్ (JDU) చీఫ్ నితీశ్ కుమార్ గురువారం (నవంబర్ 20) ప్రమాణస్వీకారం చేశారు. పాట్నాలోని గాంధీ మైదానంలో 20వ తేదీ మధ్యాహ్నం 11.30 గంటలకు ప్రమాణస్వీకారం చేశారు. ముఖ్యమంత్రిగా నితీశ్ బాధ్యతలు చేపట్టడం 10వ సారి కావడం గమనార్హం. దేశంలోనే ఇది ఒక రికార్డు.
వేడుకగా జరిగిన ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, కేంద్ర మంత్రులు రాజ్ నాథ్ సింగ్, శివరాజ్ సింగ్ చౌహాన్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, మంత్రి నారా లోకేశ్ సహా పలువురు జాతీయస్థాయి నేతలు హాజరయ్యారు.









































