ప్రపంచ బాక్సింగ్ కప్‌లో నిఖత్ జరీన్ పసిడి పంచ్.. భారత్‌కు అగ్రస్థానం

Nikhat Zareen Bags Gold in 51 kg Category, India Tops World Boxing Cup

గ్రేటర్ నోయిడాలో జరిగిన ప్రపంచ కప్‌ బాక్సింగ్‌ కప్‌ ఫైనల్స్‌లో భారత బాక్సర్లు అద్భుత ప్రదర్శన కనబరిచారు. స్టార్ బాక్సర్, తెలంగాణ అమ్మాయి నిఖత్‌ జరీన్‌ ఫామ్‌ను నిరూపించుకుంటూ స్వర్ణ పతకంతో మెరిసింది. అలాగే జరీన్‌తో పాటు మరో ఆరుగురు మహిళా బాక్సర్లు కూడా స్వర్ణాలు సాధించారు. దీంతో ఈ టోర్నమెంట్‌లో మొత్తం 20 పతకాలతో (9 స్వర్ణాలు, 6 రజతాలు, 5 కాంస్యాలు) భారత్ అగ్రస్థానంలో నిలిచింది.

నిఖత్ జరీన్ తిరుగులేని విజయం..
  • నిఖత్ జరీన్ (51 కేజీలు): గురువారం జరిగిన మహిళల 51 కేజీల ఫైనల్లో నిఖత్‌ జరీన్‌ 5-0 తేడాతో గవో యీ గ్జువాన్‌ (చైనీస్‌ తైపీ)ను చిత్తు చేసింది.

  • తొలి రౌండ్‌ నుంచే ప్రత్యర్థిపై ఎదురుదాడి చేసి విజయాన్ని సులభంగా అందుకుంది. ఇటీవల ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో క్వార్టర్స్‌లోనే ఓటమిపాలైన నిఖత్, ఈ స్వర్ణంతో తిరిగి గాడిలో పడింది.

ఇతర మహిళా బాక్సర్ల వివరాలు..
    • జైస్మిన్‌ లాంబోరియా (57 కేజీ): వుయీ (చైనీస్‌ తైపీ)పై విజయం.

    • పర్వీన్‌ హుడా (60 కేజీ): తగుచి అయాకా (జపాన్)పై విజయం.

    • అరుంధతి చౌదరి (70 కేజీ): అజీజా (ఉజ్బెకిస్థాన్)పై విజయం.

    • ప్రీతి పన్వర్‌ (54 కేజీ): సిరిన్ (ఇటలీ)పై విజయం.

    • మీనాక్షి హుడా (48 కేజీ): ఫోజిలివా (ఉజ్బెకిస్థాన్)పై విజయం.

    • నుపుర్‌ షెరోన్‌ (80 కేజీ): సొటిమ్‌బొయెవా (ఉజ్బెకిస్థాన్)ను ఓడించి స్వర్ణం గెలుచుకుంది.

పురుషుల విభాగంలో స్వర్ణాలు.. పురుషుల విభాగంలో రెండు స్వర్ణాలు భారత్‌కు దక్కాయి.
    • హితేష్ గులియా (70 కేజీ): నార్‌బెక్‌ (కజకిస్థాన్‌)పై విజయం.

    • సచిన్‌ సివాచ్‌ (60 కేజీ): మునార్‌బెక్‌ (కిర్గిజ్‌స్థాన్‌)పై విజయం.

భారత ప్రదర్శన ముగింపు..

భారత బాక్సింగ్ బృందం మొత్తం 9 స్వర్ణాలు, 6 రజతాలు, 5 కాంస్యాలు సాధించి అగ్రస్థానంతో టోర్నీని ముగించింది. పలువురు బాక్సర్లు ఫైనల్స్‌లో ఓడి రజతాలతో సరిపెట్టుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here