టీ20 ప్రపంచ కప్-2022: 15 మందితో కూడిన ఆస్ట్రేలియా జట్టు ప్రకటన, టిమ్ డేవిడ్ కు చోటు

Australia Named 15 Member Squad for ICC T20 World Cup 2022, Australia T20 World Cup 2022, Australia 15 Member Squad For World Cup 2022, ICC T20 World Cup 2022, Mango News, Mango News Telugu, ICC Mens T20 World Cup 2022, T20 World Cup 2022, Australia ICC T20 World Cup Squad, Tim David Australia World Cup Squad, Australia Squad For T20 World Cup 2022, ICC Mens T20 World Cup Australia 2022, ICC T20 World Cup 2022

టీ20 ప్రపంచ కప్-2022 అక్టోబర్ 16 నుండి నవంబర్ 13 వరకు ఆస్ట్రేలియా దేశంలో జరుగనున్న విషయం తెలిసిందే. గత జనవరిలోనే టీ20 ప్రపంచకప్‌ షెడ్యూల్ ను కూడా అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసింది. ఈ ఐసీసీ టోర్నమెంట్ కోసం ఆటగాళ్ల జాబితాపై అన్ని కీలక క్రికెట్ బోర్డులు కసరత్తు ప్రారంభించాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు టీ20 ప్రపంచకప్‌ లో పాల్గొనే ఆస్ట్రేలియా జట్టును ప్రకటించింది. ఆస్ట్రేలియా నేషనల్ సెలెక్షన్ ప్యానెల్ టీ20 ప్రపంచ కప్ కోసం 15 మంది ఆటగాళ్లతో కూడిన జట్టును ప్రకటించింది.

ఈ జట్టుకు ఆరోన్ పించ్ కెప్టెన్‌ గా వ్యవహరించనున్నారు. ఆస్ట్రేలియా సీనియర్ ఆటగాళ్లు అయిన స్టీవ్‌ స్మిత్‌, డేవిడ్‌ వార్నర్‌, గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌, పాట్‌ కమిన్స్‌ జట్టులో ఉన్నారు. టిమ్ డేవిడ్ టీ20 ప్రపంచ కప్ కోసం తొలిసారిగా ఆస్ట్రేలియా జట్టులో చోటు దక్కించుకున్నాడు. ఐపీఎల్ లో సత్తా చాటిన యువ ఆటగాడు టిమ్ డేవిడ్ జట్టులో కీలక పాత్ర పోషించే అవకాశం ఉందని భావిస్తున్నారు. మరోవైపు మిచెల్ స్వీప్సన్ కు జట్టులో చోటు దక్కలేదు. ఇక టీ20 ప్రపంచ కప్-2022 కు ఎంపికైన ఇదే 15 మందితో కూడిన ఆస్ట్రేలియా జట్టు సెప్టెంబర్ 20, 23, 25 తేదీల్లో భారత్ తో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కూడా ఆడనుంది. భారత్ లో జరిగే ఈ సిరీస్ కు డేవిడ్ వార్నర్ కు విశ్రాంతినివ్వగా, వార్నర్ స్థానంలో కామెరాన్ గ్రీన్ జట్టుతో చేరనున్నాడు.

టీ20 ప్రపంచ కప్-2022 కు ఎంపికైన ఆస్ట్రేలియా జట్టు :

  1. ఆరోన్ ఫించ్ (కెప్టెన్)
  2. అష్టన్ అగర్
  3. పాట్ కమిన్స్
  4. టిమ్ డేవిడ్
  5. జోష్ హాజెల్‌వుడ్
  6. జోష్ ఇంగ్లిస్
  7. మిచెల్ మార్ష్
  8. గ్లెన్ మ్యాక్స్‌వెల్‌
  9. కేన్ రిచర్డ్ సన్
  10. స్టీవ్ స్మిత్
  11. మిచెల్ స్టార్క్
  12. మార్కస్ స్టోయినిస్
  13. మాథ్యూ వేడ్
  14. డేవిడ్ వార్నర్
  15. ఆడమ్ జాంపా.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × one =