సోలో ఫీమేల్ ట్రావెలర్ వ్లాగర్ Karthi Kitess తన ఫ్రాన్స్ పర్యటనలో అల్లు అర్జున్ ఫ్యాన్స్‌ను ఆశ్చర్యపరిచారు. ఆమె తన బకెట్ లిస్ట్‌లో ఉన్న డ్రీమ్ డెస్టినేషన్ అయిన Mont Saint-Michel ఐలాండ్‌ను సందర్శించారు.
2020లో అల్లు అర్జున్ హీరోగా వచ్చిన ‘అల వైకుంఠపురములో’ సినిమాలోని ‘సామజవరగమనా’ పాటను ఇక్కడే షూట్ చేశారని ఆమె తెలిపారు. పారిస్‌కు వచ్చినప్పుడు తప్పనిసరిగా చూడాల్సిన ఈ UNESCO World Heritage Site చుట్టూ అప్పట్లో జైలు ఉండేదని, దీని నిర్మాణానికి 1000 ఏళ్లు పట్టిందని వ్లాగర్ వివరించారు . ఇదొక అద్భుతమైన, చారిత్రక ఐలాండ్ అని ఆమె అభివర్ణించారు. పూర్తి వివరాల కోసం ఈ వీడియో చూడండి.










































