ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోవిడ్-19(కరోనా వైరస్) పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకి పెరుగుతూనే ఉంది. రాష్ట్రంలో కొత్తగా 115 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటిలో 82 స్థానిక కేసులు కాగా, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు 33 మంది ఉన్నారు. కొత్తగా నమోదైన 82 కేసులతో కలిపి జూన్ 2, మంగళవారం ఉదయానికి రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3200 కు చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది.
రాష్ట్రంలో గత 24 గంటల్లో(9AM-9AM) జరిగిన కోవిడ్-19 పరీక్షల్లో 12,613 సాంపిల్స్ ని పరీక్షించగా 82 మంది కోవిడ్-19 పాజిటివ్ గా నిర్ధారించబడ్డారు. రాష్ట్రంలో గత 24 గంటల్లో కరోనా వలన ఎటువంటి మరణం సంభవించలేదు. ఇప్పటివరకు ఈ వైరస్ కారణంగా 64 మంది మరణించారు. మరోవైపు రాష్ట్రంలో 2209 మంది కోలుకుని డిశ్చార్జి అవ్వగా, గత 24 గంటల్లో 40 మంది కోవిడ్ నుండి కోలుకొని సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ చేయబడ్డారని తెలిపారు. ప్రస్తుతం 927 మంది చికిత్స పొందుతున్నారు.
ఇక ఏపీకి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో ఇప్పటివరకు 479 మందికి కరోనా నిర్ధారణ అవ్వగా ప్రస్తుతం 282 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని తెలిపారు. విదేశాల నుండి వచ్చిన వారిలో ఇప్పటికి 112 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయిందని పేర్కొన్నారు. ఈ 591 కేసులతో కూడా కలిపి రాష్ట్రంలో మొత్తం నమోదైన కేసుల సంఖ్య 3,791 కి చేరింది.
#COVIDUpdates: as on 02/06/2020
Total positive cases: 3200
Discharged: 2209
Deceased: 64
Active cases: 927#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/v61FXsiKcP— ArogyaAndhra (@ArogyaAndhra) June 2, 2020
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu




















































































