
వైఎస్సార్సీపీ కీలక నేత, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డికి షాక్ తగిలింది. ఆయనపై తాడేపల్లి పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. రెండు రోజుల క్రితం సజ్జల రామకృష్ణారెడ్డి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్సార్సీపీ పోలింగ్ ఏజెంట్లతో సమావేశమవడంతో ఈ వివాదం మొదలయినట్లు అయింది.
వైఎస్సార్సీపీ పోలింగ్ ఏజెంట్లతో జరిగిన సమావేశంలో మాట్లాడిన సజ్జల కొన్ని వివాదస్పదమైన వ్యాఖ్యలు చేశారు. రూల్స్‌ను కాదనలేక వెనక్కి తగ్గే వాళ్లు తమకు ఏజెంట్లుగా వద్దని..మనమేమీ రూల్స్‌ను ఫాలో అవడానికి అక్కడికి వెళ్లటం లేదని వైఎస్సార్సీపీ పోలింగ్ ఏజెంట్లకు సజ్జల ఉపదేశించారు.
అయితే సజ్జల చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారాయి. సజ్జల వ్యాఖ్యలపై తెలుగు దేశం పార్టీ మాజీ మంత్రి దేవినేని ఉమ స్పందించారు. నిబంధనలు నియమాలు పాటించేవాళ్లు ఎన్నికల కౌంటింగ్‌కు వెళ్లొద్దని చెప్పడంపై ఉమ మండిపడ్డారు. టీడీపీ, జనసేన కౌంటింగ్ ఏజెంట్లు మీద తిరగబడేవాళ్లు, వాళ్లతో దెబ్బలాడే వాళ్లు మాత్రమే కౌంటింగ్‌కు వెళ్లాలని సజ్లల చెబుతున్నారంటే..అతనికి చట్టం పట్ల, ఎలక్షన్ కమిషన్ నిబంధనల పట్ల ఎంత గౌరవం ఉందో అర్థమవుతోందని ఈ విషయాన్ని హైలెట్ చేశారు.
అంతేకాకుండా సజ్జల రామకృష్ణారెడ్డి వంటి చట్టవిరోధులని, చట్టాన్ని అతిక్రమించేవాళ్లని వెంటనే అరెస్ట్ చేయాలని దేవినేని ఉమ డిమాండ్ చేశారు.మరోవైపు వైఎస్సార్సీపీ పోలింగ్ ఏజెంట్లను రెచ్చగొట్టే విధంగా సజ్జల మాట్లాడారని ఆరోపిస్తూ తెలుగు దేశం పార్టీ న్యాయవాది గుడిపాటి లక్ష్మీనారాయణ, టీడీపీ నేతలతో కలిసి తాడేపల్లి సీఐకు గురువారం ఫిర్యాదు చేశారు.
ఐదేళ్లు అధికారపార్టీలో ఉంటున్న పెద్ద మనిషి ఇలా మాట్లాడితే.. ఇక చట్టాన్ని అతిక్రమించేవాళ్లు ఇతని మాటలను ఏ విధంగా సమర్ధించుకుంటారోనని వివరించారు. చివరకు గుడిపాటి లక్ష్మీనారాయణ, తెలుగు దేశం పార్టీ నేతల ఫిర్యాదుతో సజ్జల రామకృష్ణారెడ్డిపై ఐపీసీ సెక్షన్ 153,505 (2) IPC, 125 RPA 1951 కింద క్రిమినల్ కేసు నమోదయ్యాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY