ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణంలో జూన్ 5, శుక్రవారం ఉదయం స్వల్ప భూకంపం సంభవించింది. ఉదయం 10.15 గంటలకు రెండు సెకండ్ల పాటుగా భూమి స్వల్పంగా కంపించింది. దీంతో ప్రజలు భయాందోళనలకు గురై ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. గద్దల కుంట, ఎన్జీవో కాలనీ, సుందరయ్య భవన్ రోడ్, మామిడిపాలెం, తదితర ప్రాంతాల్లో భూమి కంపించినట్టుగా స్థానిక ప్రజలు తెలిపారు. మరోవైపు కర్ణాటక, జార్ఖండ్ రాష్ట్రాలలో కూడా శుక్రవారం ఉదయం భూమి కంపించింది. కర్ణాటకలోని హంపిలో రెక్టర్ స్కెల్ పై 4 తీవ్రత నమోదవగా, జార్ఖండ్ లోని జంషెడ్ పూర్ లో తీవ్రత 4.7 గా నమోదైనట్టు అధికారులు వెల్లడించారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu