2018 గ్రూప్‌-1 ఫలితాలు విడుదల చేసిన ఏపీపీఎస్సీ ఛైర్మన్ గౌతమ్‌ సవాంగ్‌

AP APPSC Chairman Goutam Sawang Announces 2018 Group-1 Mains Results, APPSC Chairman Goutam Sawang Announces 2018 Group-1 Mains Results, Goutam Sawang Announces 2018 Group-1 Mains Results, AP APPSC Chairman Announces 2018 Group-1 Mains Results, 2018 Group-1 Mains Results, AP APPSC releases 2018 Group-1 results, APPSC declares 2018 Group-1 results, Andhra Pradesh Public Service Commission, Andhra Pradesh Public Service Commission Chairman Goutam Sawang Announces 2018 Group-1 Mains Results, AP APPSC Chairman Goutam Sawang, APPSC Chairman Goutam Sawang, Goutam Sawang, Group-1 results, 2018 Group-1 results News, 2018 Group-1 results Latest News, 2018 Group-1 results Latest Updates, 2018 Group-1 results Live Updates, Mango News, Mango News Telugu,

ఆంధ్రప్రదేశ్‌లో ఏపీపీఎస్సీ 2018 గ్రూప్-1 ఫలితాలు విడుదలయ్యాయి. ఈ మేరకు గ్రూప్‌-1 ఇంటర్యూల్లో ఎంపికైన అభ్యర్థుల వివరాలను ఏపీపీఎస్సీ ఛైర్మన్ గౌతమ్ సవాంగ్ మంగళవారం సాయంత్రం ఫలితాలను విడుదల చేశారు. అభ్యర్థులు తమ ఫలితాలను ఏపీపీఎస్సీ అధికారిక వెబ్ సైట్ https://psc.ap.gov.in/లో చూడొచ్చని సవాంగ్ తెలిపారు. మొత్తం 167 గ్రూప్‌-1 పోస్టులకు గాను 325 మంది అభ్యర్థులు ఇంటర్వ్యూలకి హాజరయ్యారు. ఈ 167 పోస్టులలో డిప్యూటీ కలెక్టర్ పోస్టులు 30, డిఎస్పీ పోస్టులు 28 ఉన్నాయి. దీనికి ముందు దాదాపు లక్షా నలభై వేల మంది పరీక్షలు రాయగా, స్క్రీనింగ్‌ టెస్ట్‌కి యాభై వేల మందికి పైగా హాజరయ్యారని సవాంగ్ తెలిపారు. పలు కారణాలతో మరో 4 పోస్టులను భర్తీ చేయలేదని ఆయన వివరించారు.

ఫలితాల ప్రకారం.. తూర్పుగోదావరి జిల్లా పిఠాపురానికి చెందిన రాణి సుష్మితకు ఫస్ట్‌ ర్యాంక్‌ వచ్చింది. వైఎస్సార్‌ జిల్లాకు చెందిన శ్రీనివాస రాజు రెండవ ర్యాంక్‌, హైదరాబాద్‌కు చెందిన సంజన సిన్హా మూడవ ర్యాంక్‌ దక్కించుకున్నారు. గ్రూప్-1కు ఎంపికైన వారిలో 96 మంది పురుషులు, 67 మంది మహిళలు ఉన్నారని సవాంగ్ ప్రకటించారు. ఎంపికైన అభ్యర్థులు ఈ నెల 12వ తేదీలోపు బోర్డు ముందు హాజరై హామీ పత్రం ఇవ్వాల్సి ఉంటుందని సవాంగ్ సూచించారు. అలాగే జూలైలో గ్రూప్‌-2 నోటిఫికేషన్లు ఉంటాయని, ఆ తర్వాత మరో 13 నోటిఫికేషన్లు ఉంటాయని ప్రకటించారు. వీటి ద్వారా రెండు వేల పోస్టుల వరకు భర్తీ చేస్తామని ఏపీపీఎస్సీ ఛైర్మన్ గౌతమ్‌ సవాంగ్‌ వెల్లడించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ten − seven =