
మచిలీపట్నం ఎంపీ బాలశౌరి చొరవ ఎట్టకేలకు ఫలించింది. గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి ముంబైకి ఎయిర్ ఇండియా సంస్థ నూతన సర్వీసును ఈ రోజు నుంచి ప్రారంభించబోతోంది. ఎంపీ బాలశౌరి ఎయిర్‌పోర్టు అథారిటీ ఛైర్మన్‌గా ఉన్న సమయంలో చాలాసార్లు విజయవాడ నుంచి ముంబైకి విమాన సర్వీసును ఏర్పాటు చేయాలని సంబంధిత మంత్రిని, అధికారులను కలిశారు. చివరకు తాజాగా కేంద్ర ప్రభుత్వం ఆదేశాలతో గన్నవరం నుంచి ముంబయి నగరానికి విమాన సర్వీసు ప్రారంభమవుతోంది.
ఈ రోజు నుంచి విజయవాడ నుంచి దేశ ఆర్థిక రాజధాని ముంబైకి ఎయిర్ ఇండియా వారి విమాన సేవలు ప్రారంభమవుతుండగా..ఈ విమాన సర్వీసును మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి చేతుల మీదుగా ప్రారంభమవబోతుంది. దీంతో విజయవాడ, గుంటూరు, ఒంగోలు, ఏలూరులో ఉండే వ్యాపారవేత్తలకు సమయం కలిసి వస్తుంది. దీంతో ఏపీ వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇటు ఎంపీ బాలశౌరికి ఎన్డీయే కూటమి నేతలు, కార్యకర్తలు, ప్రజలు అభినందనలు తెలియజేస్తున్నారు.
ఈ రోజు సాయంత్రం 5.45 గంటలకు ముంబై నుంచి విజయవాడకు వచ్చే విమానం .. తిరిగి 7.10 గంటలకు విజయవాడ నుంచి ముంబైకు తిరిగి వెళ్లనుంది. రోజూ ఇదే టైమింగ్స్‌తో ఈ సర్వీసు ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఎయిర్ ఇండియా ఫ్లైట్ AI 599 నంబరుపై సర్వీసు డైలీ అందుబాటులో ఉంటుందని..సుమారు 180 మంది ప్రయాణికులు దీనిలో ప్రయాణించవచ్చని అధికారులు తెలిపారు.
గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి ముంబైకి అందుబాటులోకి వచ్చిన ఈ ఎయిర్ ఇండియా సర్వీసు విదేశాలకు వెళ్లాలనుకునే ప్రయాణికులకు చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. ఎందుకంటే ముంబై నుంచి చాలా దేశాలకు విమాన సర్వీసులు ఉన్నాయి. దీంతో ఈ విమాన సర్వీసు ఆ దేశాలకు వెళ్లే కనెక్టింగ్ ఫ్లైట్‌గా సేవలు అందించబోతుందని కృష్ణా జిల్లా వాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ