తెలుగుదేశం, జనసేనతో పొత్తు వల్ల ఏపీలో బీజేపీ తన ఉనికిని చాటుకున్నది. అయితే రానున్న రోజుల్లో ఏపీలో బీజేపీ పార్టీ పరిస్థితి మరింత పుంజుకోనుందా… ఆ పరిస్థితులు ఏపీలో బీజేపీకి ఉన్నాయా… ఒకవేళ బీజేపీ పార్టీ బలంగా తయారయితే ఏ పార్టీకి నష్టం చేకూరనుందని ప్రశ్న రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. 2019లో ఒక్క ఎమ్మెల్యే సీటు గాని ఎంపీ సీటు గాని సాధించని బీజేపీ పార్టీ గత ఎన్నికల్లో 6 ఎమ్మెల్యేలు, 3 ఎంపీలను గెలుచుకుంది. టీడీపీతో పొత్తు బీజేపీ కి కేంద్రంలో కూడా సహాయపడింది. ఏపీలో ఎన్డీయే 21 ఎంపీ సీట్లు సాధించింది. ఏపీలో క్రమక్రమంగా బలం పెంచుకునే దిశగా బిజెపి అడుగులు వేస్తోంది. ప్రస్తుతానికి మూడు పార్టీలు కలిసి ముందుకు వెళుతున్నా.భవిష్యత్తులో సమన్వయ లోపం ఏర్పడకుండా ముందుగానే జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ మేరకు బీజేపీ చేరికల విషయంలో వ్యవహాత్మకంగా వ్యవహరిస్తోంది. పార్టీలోకి పెద్ద ఎత్తున చేరికలను ప్రోత్సహించాలనే లక్ష్యాన్ని పెట్టుకుంది బిజెపి.
ఎన్నికలకు ముందు, ఎన్నికల తర్వాత పార్టీ ఫిరాయింపులు, చేరికలు సర్వసాధారణమే. వ్యక్తులను బట్టి నియోజకవర్గాలను బట్టి ఆ చేరికల్లో ప్రాధాన్యం ఉంటుంది. అయితే గ్రామ మండల స్థాయిలో నాయకులు చేరిక విషయాన్ని పెద్దగా పట్టించుకోకపోయినా, నియోజకవర్గ ,రాష్ట్ర స్థాయి నేతలను చేర్చుకునే విషయంలో మాత్రం ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. హడావుడిగా వారిని చేర్చుకోకూడదని నిర్ణయించుకుంది. ప్రస్తుతం కూటమిలో ఉన్న నేపథ్యంలో ఇతర పార్టీల నుంచి బీజేపీలో చేరే వారి విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని రాష్ట్ర బీజేపీ నాయకత్వం భావిస్తోంది. బీజేపీ పొత్తు తో తిరుగులేని విధంగా ఏపీలో ఎన్డీఏ కూటమి బలంగా ఉంది. ఈ నేపథ్యంలోనే వైసీపీలో ఉన్న కీలక నాయకులు చాలామంది బిజెపిలో చేరి కేసుల నుంచి బయటపడాలని చూస్తున్నారు. అటువంటి వారిని చేర్చుకుంటే టీడీపీ అధిష్టానం అసంతృప్తికి గురయ్యే అవకాశం ఉందని బీజేపీ భావిస్తోంది. విరిని చేర్చుకోవడం ద్వారా భవిష్యత్తులో తలెత్తే ఇబ్బందులు ఇలా అన్నింటిని పూర్తిగా పరిశీలించి కూటమి ప్రభుత్వానికి ఎటువంటి ఇబ్బంది లేకపోతే వారిని చేర్చుకోవాలని బీజేపీ నిర్ణయించుకుందట.
ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టడంతో బీజేపీ ఎదుగుదల ఏ పార్టీని దెబ్బతీసే అవకాశముందన్న చర్చ కూడా నడుస్తోంది. గత రెండు పర్యాయాలు చూసుకుంటే దేశవ్యాప్తంగా బీజేపీ ఏ పార్టీతో పొత్తు పెట్టుకుంటే ఆ పార్టీలు నష్టపోయిన విషయాన్ని గమనించాలి. దేశమంతటా బీజేపీకి మిత్ర పక్షాలున్నాయి. బీజేపీ ఆయా రాష్ట్రాల్లో పెరుగుతున్న సమయంలో మిత్ర పక్షాల బలం తగ్గుతూ వచ్చింది. బీహార్ లో జేడీయూ- బీజేపీ పొత్తు లో క్రమంగా బీజేపీ పెరగగా జేడీయూ తగ్గుతూ వచ్చింది. ఇక మహారాష్ట్రలో బీజేపీ శివసేన మధ్య పొత్తు ఇక్కడ కూడా బీజేపీ తన ఉనికిని చాటేందుకు శివసేన తో పొత్తు పెట్టుకున్న బీజేపీ తన బలాన్ని చాటుకోగా ..శివసేన డీలా పడుతూ వచ్చింది. అనంతరం బీజేపీ తో విడిపోయి కాంగ్రెస్ తో కలిసింది. ఇక తమిళనాడులో ఏడీఎంకే తో బీజేపీ పొత్తు లో ఉంది. గత ఎన్నికల్లో 3.6 శాతం ఓట్లు సాధించిన బీజేపీ ఇప్పుడు విడిగా పోటీచేసి 11 శాతం ఓట్లను సాధించించగా ఏడిఏంకే ప్రబల్యం కొద్ది మేరకు తగ్గింది. ఇక పంజాబ్ లో కూడా బీజేపీ తన ఓటింగ్ శాతాన్ని పెంచుకోగ అకాళీదళ్ ఓటింగ్ తగ్గింది. ఇలా బీజేపీతో పొత్తు లో ఉన్న ప్రతి రాష్ట్రంలో బీజేపీ తన ప్రాబల్యాన్ని పెంచుకోగా మిత్రపక్షాలు ఎంతోకొంత బలహీనపడ్డాయి. అంతే కాదు బీజేపీ తో ప్రత్యక్షంగా మిత్రపక్షంగా లేకున్న పరోక్షంగా పార్లమెంట్ లో మద్దతు తెలిపిన పార్టీలు కూడా డీలా పడగా బీజేపీ మాత్రం అనుహ్యంగా పుంజుకుంది. ఏపీలో వైసీపీ, తెలంగాణలో బీఆర్ఎస్ కూడా అదే కోవలోకి వస్తాయి. ఈ పరిణామాల నేపథ్యంలో ఏపీలో బీజేపీ పార్టీ పెరిగితే అది టీడీపీకి దెబ్బ పడనుందా లేక జనసేన పార్టీకా లేక వైసీపీని దెబ్బతీస్తుందా అనేది కాలమే సమాధానం చెప్పాలి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE