చంద్రబాబు అధ్యక్షతన ఏ కీలక అంశాలు చర్చకు వస్తాయి?

AP Cabinet Meeting Today,Cabinet Meeting,AP Cabinet,AP Cabinet Meeting,Cabinet Meeting Today, AP Sachivalayam, Key Issues Will Be Discussed, AP CM Chandrababu,,Amaravati,Chandrababu, capital city,AP, Amaravati, Chandrababu Naidu, capital city,Andhra pradesh,Andhra pradesh capital, AP capital city,cabinet meeting,,Janasena,Loksabha,YCP,Pawan Kalyan,AP Live Updates, AP Politics, Political News,Mango News, Mango News Telugu
AP Cabinet meeting,key issues will be discussed ,Ap Cm Chandrababu, Ap Sachivalayam

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఈ రోజు ఏపీ కేబినెట్ భేటీ జరగబోతుంది. వెలగపూడిలోని ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో మంగళవారం ఉదయం 11 గంటలకు మంత్రి మండలి సమావేశం కానుంది. ఈ భేటీలో అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై ఏపీ కేబినెట్ చర్చించబోతున్నట్లు తెలుస్తోంది. అసెంబ్లీలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కనుక ప్రవేశపెడితే ఆ ఆర్డినెన్స్‌ను మంత్రి మండలి ఆమోదించనున్నట్లు కూడా తెలుస్తోంది.

ఆంధ్రప్రదేశ్‌లో ప్లాంట్ ఏర్పాటుకు మొగ్గు చూపిస్తున్న బీపీసీఎల్ రిఫైనింగ్ ప్రతిపాదనలపై ఏపీ మంత్రులు చర్చించనున్నట్లు సమాచారం. ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకువచ్చిన ఇసుక పాలసీ విధివిధానాలపై ఏపీ కేబినెట్ మరోసారి చర్చించనున్నట్లు తెలుస్తోంది.అలాగే తల్లికి వందనం, ఎక్సైజ్ పాలసీకి సంబంధించిన గైడ్ లైన్స్‌పైన కూడా మంత్రి మండలి చర్చలు జరపనున్నట్లు సమాచారం.

వీటితో పాటు ఈ రోజు సాయంత్రం ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఈ పర్యటనకు సంబంధించిన ఏజెండాను ఏపీ మంత్రులకు వివరించనున్నట్లు తెలుస్తోంది. ఈ రోజు సాయంత్రం ఢిల్లీ పర్యటనకు వెళ్తున్న చంద్రబాబు.. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో భేటీ కానున్నారు. ఎన్డీఏ కూటమిలో ప్రధాన పాత్ర ప్లే చేస్తోన్న సీఎం చంద్ర బాబు  ఢిల్లీకి వెళ్లనుండటంతో ..ఆయన ఢిల్లీ పర్యటనపై రాష్ట్ర పాలిటిక్స్‌లో ఆసక్తి నెలకొంది. అమిత్ షాతో చంద్రబాబు ఏ అంశాలపై చర్చిస్తారనే ఆసక్తి  నెలకొంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ