ప్రపంచ బ్యాంకు ప్రతినిధులతో సీఎం భేటీ..

AP CM Chandra Babu Naidu Meets Representatives Of World Bank,ADB Bank,Amaravathi Capital,Amaravathi Capital Plan,AP CM Chandrababu Naidu,CBN,NDA,TDP,Amaravathi Capital Master Plan,World Bank,Mango News,Mango News Telugu,Andhra Pradesh,AP,AP News,AP Latest News,AP Politics,AP Political News 2024,Andhra Pradesh News,Andhra Pradesh Politics,TDP,TDP Latest News,Chandrababu Naidu,CM Chandrababu Naidu,CM Chandrababu,CM Chandrababu Latest News,CM Chandrababu News,CM Chandrababu Live,CM Chandrababu Pressmeet,CM Chandrababu Speech,Amaravathi,CM Chandrababu Meets Representatives Of World Bank,CM Chandrababu Meets With World Bank & ADB Representatives,World Bank Representatives Met AP CM Chandrababu Naidu at Secretariat,World Bank ADB Representatives Meets CM Chandrababu,CM Chandrababu Meeting With World Bank Team,World Bank Team Visits Amaravati

ప్రపంచ బ్యాంకు సహకారంతో అమరావతికి నిధులు సమకూర్చేందుకు కేంద్రం చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలో ప్రపంచ బ్యాంకు మరియు ఏడీబీ ప్రతినిధులు ఏపీ రాజధాని అమరావతిని సందర్శించారు. రాజధాని అమరావతికి నిధులు అందించే విషయంపై ప్రభుత్వంతో చర్చలు జరిపింది. కేంద్రం ప్రతిపాదించిన 15 వేల కోట్లు ఈ బ్యాంకులు రుణాల్ని సమకూర్చనున్నాయి. ప్రపంచ బ్యాంకు, ఏడీబీ బ్యాంకు ప్రతినిధులతో సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ అయ్యారు. భేటీ విశేషాలను సీఎం చంద్రబాబు ట్వీట్ చేశారు. అమరావతి అభివృద్ధి ప్రణాళికలు, ప్రభుత్వ విజన్ పై వారితో చర్చలు జరిపినట్లు సీఎం ట్వీట్ చేశారు. భవిష్యత్ రాజధాని అమరావతిలో భాగస్వామ్యం కావాల్సిందిగా రెండు బ్యాంకులను ఆహ్వానించింది.

ప్రధానంగా అమరావతి నిర్మాణం, అభివృద్ధికి ఆర్థిక సాయంపై చర్చలు సాగాయి. అమరావతి నిర్మాణానికి రూ. 15 వేల కోట్లు నిధులు అందిస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదన నేపథ్యంలో ఈ చర్చలు జరిగినట్లు తెలిసింది. అమరావతి అభివృద్ధికి రాష్ట్ర నిబద్ధతను వారు బ్యాంకు బృందనానికి వివరించారు. ప్రాథమికంగా అమరావతిలో చేపట్టాల్సిన పనులు, దశలవారీగా నిధుల విడుదలపై సీఎంతో ప్రపంచ బ్యాంక్, ఏడీబీ ప్రతినిధులు చర్చలు జరిపారు. అమరావతి ప్రాజెక్టులో పనుల పురోగతి, క్షేత్ర స్థాయి పర్యటనలు, భూ సమీకరణ, మౌళిక సదుపాయాలు, పెట్టుబడుల గురించి చర్చించారు. రాజధాని పరిధిలో ప్రభుత్వ ప్రాధాన్యత ప్రాజెక్టులు, విధాన నిర్ణయాలను ప్రపంచ బ్యాంక్, ఏడీబీ ప్రతినిధులకు సీఎం చంద్రబాబు వివరించారు. సీఆర్డీఏ క్షేత్ర స్థాయిలో ప్రపంచ బ్యాంక్, ఏడీబీ ప్రతినిధులు ఇచ్చారు. ముఖ్యమంత్రితో పాటు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మంత్రి పి. నారాయణ, ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కాగా ఈ నెల 27వ తేదీ వరకు రెండు బ్యాంకుల ప్రతినిధులు అమరావతిలో సైట్‌ విజిట్‌ నిర్వహించనున్నారు.