ఒంటిమిట్టలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు, సీఎం జగన్ కు ఆహ్వానపత్రిక అందజేసిన టీటీడీ ఈవో

TTD EO Jawahar Reddy Invites CM YS Jagan for Vontimitta Sri Rama Navami Brahmotsavalu, Vontimitta Sri Rama Navami Brahmotsavalu, TTD EO Jawahar Reddy Invites CM YS Jagan, Sri Rama Navami Brahmotsavalu, Vontimitta Sri Rama Navami, AP CM YS Jagan invited for celestial Kalyanam at vontimitta, celestial Kalyanam at vontimitta, TTD Executive officer Jawahar Reddy, TTD Executive officer, Jawahar Reddy, TTD EO Jawahar Reddy, vontimitta celestial Kalyanam, vontimitta celestial Kalyanam News, vontimitta celestial Kalyanam Latest News, vontimitta celestial Kalyanam Latest Updates, AP CM YS Jagan Mohan Reddy, Jagan Mohan Reddy, AP CM YS Jagan, YS Jagan Mohan Reddy, YS Jagan, CM YS Jagan, Mango News, Mango News Telugu,

వైఎస్ఆర్ కడప జిల్లా ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో ఏప్రిల్ 9 నుండి 19వ తేదీ వరకు శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఒంటిమిట్టలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలకు ఏప్రిల్ 9, శ‌నివారం సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణ జరగనున్నట్టు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఒక ప్రకటనలో వెల్లడించింది. ఈ నేపథ్యంలో శుక్రవారం నాడు తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిని టీటీడీ ఈవో డాక్టర్‌ కేఎస్‌ జవహర్‌రెడ్డి, ఒంటిమిట్ట ఆలయ డిప్యూటీ ఈవో డాక్టర్‌ రమణ ప్రసాద్‌ కలిసి ఒంటిమిట్టలో జరిగే శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవ ఆహ్వన శుభపత్రికను అందజేశారు.

ఏప్రిల్ 15వ తేదీన రాత్రి 8 గంటల నుంచి 10 గంటల వరకు శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవం జరగనున్నట్లు సీఎంకు తెలిపారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ కు వేద పండితులు ఆశీర్వచనం చేసి, ప్రసాదాలు అందజేశారు. మరోవైపు ఏప్రిల్ 9న ఉదయం వ్యాసాభిషేకంతో ఉత్సవాలు ప్రారంభం కానుండగా, ఏప్రిల్ 19న పుష్పయాగంతో ముగియనున్నాయి. ఏప్రిల్ 10, ఆదివారం ఉదయం 8 నుండి 9 గంటల మధ్య వృషభ లగ్నంలో ధ్వజారోహణం జరుగనుంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fifteen − 10 =