ఒక విధంగా నందమూరి బాలకృష్ణపై జనాల్లో ఉన్న నెగిటివిటీని పోగొట్టేసింది ఆహాలోని అన్ స్టాపబుల్ షోనే. బాలయ్యలోని మరో యాంగిల్ ఉందా అని ఆడియన్స్ షాకయ్యేలా హోస్ట్ గా వందకు వంద మార్కులు సంపాదించుకున్నారు. అందేకేనేమో అన్‍స్టాపబుల్ షో కు ముందు బాలకృష్ణరకు.. ఆ షో తర్వాత బాలకృష్ణ కు క్రేజ్ అమాంతం పెరిగిపోయింది.
ఇప్పటికే మూడు సీజన్లు దిగ్విజయంగా పూర్తి చేసుకున్న అన్‍స్టాపబుల్ షో అక్టోబర్ 25 నుంచి నాలుగో సీజన్ తో సరికొత్తగా రావడానికి రెడీ అయిపోయింది. ఒకవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు హోస్ట్ గా బాలయ్య చేస్తున్న షో అన్‍స్టాపబుల్ షో.. ఈ షో మూడు సీజన్లను సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసుకుని ..నాలుగో సీజన్ లోకి అడుగుపెట్టింది.
ప్రస్తుతం నాలుగో సీజన్ పై ఆల్రెడీ భారీ హైప్ క్రియేట్ అయిపోయింది. దీనికి కారణం మొదటి ఎపిసోడ్ కు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు రావడంతో క్రేజ్ డబుల్ అయిపోయింది.ఈ ఎపిసోడ్ షూటింగ్ అక్టోబర్ 21న పూర్తి అవగా…ఆ ఎపిసోడ్ లో సీఎం చంద్రబాబును ఎలాంటి ప్రశ్నలు అడుగుతారో, ఎలాంటి రాజకీయ సీక్రెట్స్ బయట పెడతారా అన్నది ఆసక్తిగా మారింది.
ఆదివారం హైదరాబాద్‍లోని అన్నపూర్ణ స్టూడియోస్‍కు ఏపీ సీఎం చంద్రబాబు , హోస్ట్ బాలకృష్ణ వచ్చారు. అన్‍స్టాపబుల్ సెట్‍లో ఈ ఎపిసోడ్ షూటింగ్ జరిగింది. తన బావ సీఎం చంద్రబాబును ప్రశ్నలు అడిగిన బాలకృష్ణ సరదాగా మాట్లాడారు. అందులో ఎక్కువగా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మధ్య బాండింగ్ గురించి మాట్లాడినట్లు తెలుస్తుంది. అంతేకాదు పవన్ మొండితనం గురించి ఏకంగా సీనియర్ ఎన్టీఆర్ తో పోల్చి చెప్పారంటూ ఓ వార్త వైరల్ అవుతోంది.
ఏపీ సీఎం చంద్రబాబు అతిథిగా పాల్గొన్న అన్ స్టాపబుల్ 4 తొలి ఎపిసోడ్.. అక్టోబర్ 25 రాత్రి 8 గంటల 30 నిమిషాలకు ప్రీమియర్ అవుతుంది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో అన్‍స్టాపబుల్ సీజన్ 4 మొదలుకానుందని ఆహా ట్వీట్ చేసింది. కష్టమైన ప్రశ్నలు, శక్తివంతమైన మాటలు, సర్‌ప్రైజ్‍లు, అంతకుమించి ఎంటర్‌టైన్‍మెంట్ పై సీఎం మాట్లాడారని. అన్‍స్టాపబుల్ సీజన్ 4 అక్టోబర్ 25 వతేదీన రాత్రి 8.30 గంటలకు ప్రీమియర్ కానుందని ఆహా పోస్ట్ చేసింది.