అధికారపక్షానికి దొరికిన ఆయుధం

A Weapon Found By The Ruling Party, A Weapon Found, Ruling Party Weapon Found, Ruling Party, Pawan kalayan , Janasena party , Elections of AP State, Jagan, Andhra Pradesh Elections, AP Political News, AP Live Updates, Andhra Pradesh, Political News, Mango News, Mango News Telugu
pawan kalayan , Janasena party , elections of AP state, A weapon found by the ruling party

జనసేనాని పవన్‌కల్యాణ్‌కు అన్న చిరంజీవి అండగా నిలిచారు. నీవెంట నేనున్నాను.. అంటూ భరోసా ఇచ్చారు. అంతేకాకుండా.. తమ్ముడిని పొగడ్తలతో ముంచెత్తారు. ‘‘అధికారంలోకి వచ్చాక ఎవరైనా సాయం చేస్తారు.. అధికారంతో సంబంధం లేకుండా తమ్ముడు పవన్‌కల్యాణ్‌ రైతు కూలీల కోసం తన సంపాదనను పంచారు. అది నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. పవన్‌ లక్ష్యానికి కొంతైనా ఉపయోగపడుతుందని నేను సైతం జనసేనకు విరాళాన్ని అందించాను’ అంటూ రూ. ఐదు కోట్ల చెక్కును జనసేనాని పవన్‌కల్యాణ్‌కు అందించారు. ఈ సందర్భంగా పవన్‌.. అన్న కాళ్లకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నారు.

ఈక్రమంలో జనసేనానికి వెనుకే చిరంజీవి అని.. ఆ పార్టీ విస్తృతంగా ప్రచారం చేస్తుంటే.. జనసేన.. ప్రజారాజ్యం పార్ట్‌-2 అని విపక్షాలు విపరీతంగా ప్రచారం సాగిస్తున్నాయి. పోతిన మహేష్‌ చేసిన వ్యాఖ్యలే అందుకు కారణం. విజయవాడ వెస్ట్‌ సీటును ఆశించి భంగపడ్డ పోతిన.. జనసేనకు రాజీనామా చేస్తూ, ఆ పార్టీపై తీవ్రమైన స్థాయిలో ఆరోపణలు చేశారు. మరో ఆరు నెలల్లో జనసేన పార్టీ గల్లంతు కావడం ఖాయమని జోస్యం చెప్పారు. అంతేకాదు.. జనసేన పార్టీ.. ప్రజారాజ్యం పార్ట్‌-2 అంటూ కామెంట్‌ చేశారు. ఇదే అదునుగా అధికార పార్టీ.. పోతిన వ్యాఖ్యలకు కాస్త మసాలా జోడించి ప్రచారం చేస్తోంది. ఎన్నికల అనంతరం జనసేన ఉండదంటూ సామాజిక మాధ్యమాల్లో జోరుగా వైరల్‌ చేస్తోంది.

కూటమిని కొల్లగొట్టేందుకు ఏ అవకాశం దొరుకుతుందా అని వైసీపీ ఎదురుచూస్తోంది. జనసేనను టీడీపీలోకి విలీనం చేస్తారంటూ ఎప్పటినుంచో  ప్రచారం చేస్తోంది. ఇప్పుడు తాజాగా పోతిన మహేశ్‌ వ్యాఖ్యలు ఆ పార్టీకి బలం చేకూర్చాయి. ఈక్రమంలోనే అతడిని వైసీపీలోకి చేర్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. జగన్‌ చేపడుతున్న మేమంతా సిద్ధం బస్సుయాత్రలో మహేశ్‌ వైసీపీలోకి చేరతారని ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే విలీనం ప్రచారాన్ని మరింత ఉధృతంగా చేపట్టి.. జనసేనాని పవన్‌ కల్యాణ్‌ను టార్గెట్‌ చేయాలని అధికార పార్టీ భావిస్తోంది. ఈక్రమంలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ మారుతున్న రాజకీయ పరిణామాలు ఏపీలో ఆసక్తిని రేపుతున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nineteen − eighteen =