ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం వైఎస్ఆర్ కడప జిల్లాలో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా ఆయన జిల్లాలోని సున్నపురాళ్లపల్లె గ్రామంలో దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న స్టీల్ ప్లాంట్ ప్రాజెక్టుకు రేపు భూమిపూజ చేయనున్నారు. ఇక ఈ భూమిపూజ కార్యక్రమంలో సీఎం జగన్ సహా జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ చైర్మన్ సజ్జన్ జిందాల్ కూడా పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ జిల్లా యంత్రాంగం ప్రతిష్టాత్మక ప్రాజెక్టు కోసం కేటాయించిన భూమిని చదును చేయడం ప్రారంభించింది. అలాగే కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, జమ్మలమడుగు ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి సోమవారం ప్లాంటు భూమిపూజ జరిగే స్థలాన్ని సందర్శించారు.
కాగా గతంలో జమ్మలమడుగు ప్రాంతంలో ప్లాంట్ నెలకొల్పేందుకు రెండు దశల్లో రూ.8,800 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు జేఎస్‌డబ్ల్యూ స్టీల్ కంపెనీ ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఇక ప్రస్తుత ప్రణాళిక ప్రకారం, సంవత్సరానికి మూడు మిలియన్ టన్నుల సామర్థ్యంతో మరియు దాదాపు 25,000 మందికి ఉద్యోగాలు కల్పించే ప్లాంట్‌లో పనులు వచ్చే మూడేళ్లలో పూర్తవనున్నట్లు అధికారులు తెలిపారు. ఇక దీనికోసం జమ్మలమడుగు ప్రాంతంలో ప్రాజెక్టు కోసం మొత్తం 3,295 ఎకరాలు సేకరించారు. ఇక జాతీయ ఉక్కు విధానం 2017, ప్రకారం భారతదేశ ఉక్కు తయారీ సామర్థ్యం 2030 నాటికి సంవత్సరానికి 300 మిలియన్ టన్నులకు చేరుకుంటుందని అంచనా.
కాగా 2019 డిసెంబర్ 23న సున్నపురాళ్ల పల్లె గ్రామంలో సీఎం జగన్ ఏపీహెచ్‌ఎస్‌ఎల్‌కు శంకుస్థాపన చేశారు. ఇక జేఎస్‌డబ్ల్యూ స్టీల్ కంపెనీ సంవత్సరానికి 3 మిలియన్ టన్నుల సామర్థ్యంతో హై-గ్రేడ్ స్టీల్ ఉత్పత్తులను ఉత్పత్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది. ముడిసరుకు వనరులకు సమీపంలోని ప్రధాన ఆటో మరియు పారిశ్రామిక కేంద్రాలకు యాక్సెస్‌తో పాటు రోడ్డు, రైలు, సముద్రం మరియు వాయు మార్గాల ద్వారా కనెక్టివిటీ ఉండటంతో ఇక్కడ ఏర్పాటుకు కంపెనీ సంసిద్ధత తెలిపింది. కాగా ఈ ప్లాంట్ నిర్మాణానికి దాదాపు రూ. 700 కోట్ల నిధులను వెచ్చించి మౌలిక వసతులను కల్పిస్తోంది. ప్లాంటును జాతీయ రహదారికి అనుసంధానిస్తూ 7.5 కి.మీ అప్రోచ్ రోడ్డును నిర్మిస్తోంది. అలాగే ప్రొద్దుటూరు-ఎర్రగుంట్ల రైల్వే లైనుకు కలుపుతూ 10 కి.మీ మేర కొత్త రైల్వే లైను ఏర్పాటు చేస్తోంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE