ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జనవరి 2, గురువారం నాడు రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తో భేటీ అయ్యారు. తన సతీమణి వైఎస్ భారతితో కలిసి రాజ్‌భవన్‌కు వెళ్లిన సీఎం వైఎస్ జగన్ ముందుగా గవర్నర్‌కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం రాష్ట్రంలోని తాజా పరిస్థితులపై గవర్నర్ తో చర్చించనున్నట్టు తెలుస్తుంది. ఇటీవల జరిగిన శీతాకాల అసెంబ్లీ సమావేశాల చివరి రోజున సీఎం వైఎస్ జగన్ మూడు రాజధానులు ప్రతిపాదన అంశం లేవనెత్తిన అనంతరం రాజధాని రైతులు గత 16 రోజులుగా ఆందోళనలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ భేటీలో రైతుల ఆందోళనలపై సీఎం వైఎస్ జగన్ గవర్నర్‌కు వివరించే అవకాశం ఉంది. అలాగే రాష్ట్రసమగ్రాభివృద్ది, రాజధాని అంశంపై జీఎన్ రావు కమిటీ సమర్పించిన నివేదిక, ఆ నివేదిక పరిశీలనకు హైపవర్ కమిటీ నియమకం, ప్రతిపక్షాల ఆందోళనతో పాటుగా ఇతర కీలక అంశాలపై కూడా చర్చ జరుగనున్నట్లు తెలుస్తోంది.
[subscribe]










































