జనవరి 4న టిఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశం

CM KCR Meeting With Party Leaders, kcr latest news, Mango News Telugu, Political Updates 2020, telangana, Telangana Breaking News, Telangana Political Live Updates, Telangana Political Updates, Telangana Political Updates 2020
తెలంగాణ రాష్ట్ర సమితి(టిఆర్ఎస్) పార్టీ విస్తృతస్థాయి సమావేశం జనవరి 4వ తేదీన జరగనుంది. టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు అధ్యక్షత వహించే ఈ సమావేశం, పార్టీ రాష్ట్ర కార్యాలయమైన తెలంగాణ భవన్‌లో నిర్వహించనున్నారు. శనివారం ఉదయం 11.30 గంటలకు ప్రారంభమయ్యే ఈ విస్తృతస్థాయి సమావేశం సాయంత్రం నాలుగు గంటల వరకు కొనసాగనుంది. రాష్ట్రంలో త్వరలో జరగబోయే మున్సిపల్ ఎన్నికలపై పార్టీ నాయకులకు సీఎం కేసీఆర్ పూర్తిస్థాయిలో దిశానిర్దేశం చేయనున్నారు. ఈ కీలక సమావేశానికి హాజరు కావాల్సిందిగా టిఆర్ఎస్ పార్టీ లోక్ సభ, రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా పరిషత్తుల చైర్‌పర్సన్‌లు, రాష్ట్ర కార్పొరేషన్‌ల చైర్మన్‌లు, పార్టీ కార్యవర్గ సభ్యులుతో పాటుగా కొందరి ప్రత్యేక ఆహ్వానితులను ఆహ్వానించారు.

[subscribe]

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × two =