
అమరావతిలోని సెక్రటేరియట్‌లో 2వ బ్లాక్‌లో జనసేన మంత్రులకు చాంబర్లు ఫిక్స్ అయ్యాయి. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కోసం రెండో బ్లాక్‌లోని మొదటి అంతస్తులో 212 నెంబర్ గల విశాలమైన రూమ్‌ను అధికారులు సిద్ధం చేశారు. పవన్‌తో పాటు జనసేనకు చెందిన మరో ఇద్దరు మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేశ్ చాంబర్లు కూడా పక్కపక్కనే ఉంటాయి.
అయితే ముందుగా చంద్రబాబు తన బ్లాక్‌లోనే పవన్ కళ్యాణ్‌కు కూడా ఓ చాంబర్‌ను కేటాయించాలని అధికారులకు చెప్పినట్లుగా వార్తలు వినిపించాయి. పవన్‌కు హై సెక్యూరిటీ ఉండటంతో.. మొదటి బ్లాకులోనే ఆయనకు ఓ చాంబర్‌ను కేటాయించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు న్యూస్ వినిపించింది. అయితే పవన్‌కు అభిమానులు ఎక్కువగా ఉంటారు. దీంతో పవన్ ను చూడటానికి అభిమానులు తరలి వచ్చినప్పుడు పాలనాపరంగా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పవన్ చాంబర్ ను రెండో బ్లాకులో రెడీ చేసినట్లు తెలుస్తోంది.
జూన్ 19న తన చాంబర్‌లో మంత్రిగా పవన్ కళ్యాణ్ బాధ్యతలను స్వీకరించబోతున్నారు. ఇప్పటికే మంత్రులందరూ ప్రమాణ స్వీకారం చేయగా.. బాధ్యతలు స్వీకరించడం మిగిలి ఉంది. పవన్ కళ్యాణ్‌కు పంచాయతీ రాజ్ శాఖతో పాటు గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, అటవీ, పర్యావరణ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలు కేటాయించిన విషయం తెలిసిందే.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE