సీఎం జగన్ ఇప్పటికే ఎన్నో సంక్షేమ పథకాలు అందిస్తున్నారు.. చంద్రబాబు వచ్చి కొత్తగా ఇచ్చేదేంటి? – మాజీ మంత్రి కొడాలి నాని

Former Minister Kodali Nani Sensational Comments Over The manifesto Announced by TDP Chief Chandrababu in Mahanadu,Former Minister Kodali Nani Sensational Comments,Kodali Nani Sensational Comments,Kodali Nani Over The manifesto Announced by TDP,manifesto Announced by TDP Chief Chandrababu,Mango News,Mango News Telugu,TDP Chief Chandrababu in Mahanadu,Chandrababu Naidu Releases Draft Manifesto,TDP Manifesto For 2024 State Elections,TDP Manifesto,TDP 2024 State Elections,Former Minister Kodali Nani,Former Minister Kodali Nani Latest News,Minister Kodali Nani Latest Updates,Kodali Nani Comments,Mahanadu,Mahanadu TDP manifesto,Mahanadu Latest News and Updates

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ మంత్రి కొడాలి నాని టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్‌ శత జయంతి వేడుకలు నిర్వహించే అర్హత చంద్రబాబుకి లేదన్న ఆయన, వేడుకల పేరుతో చంద్రబాబు తన భజన చేయించుకున్నారని విమర్శించారు. రాజమహేంద్రవరం సమీపంలోని వేమవరంలో టీడీపీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన రెండు రోజుల మహానాడు ముగింపు కార్యక్రమంలో భాగంగా ఆదివారం చంద్రబాబు నాయుడు భారీ బహిరంగ సభలో పాల్గొన్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన రాష్ట్రంలోని వివిధ వర్గాల ప్రజలకు మేలు చేకూర్చేలా ‘భవిష్యత్ కి గ్యారెంటీ’ పేరుతో తొలి దశ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. ఈ నేపథ్యంలో దీనిపై అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ స్పందించింది.

సోమవారం మాజీ మంత్రి కొడాలి నాని మీడియాతో మాట్లాడుతూ.. ‘శత దినోత్సవ వేడుకలు అంటే ఇవేనా? చంద్రబాబును పొగిడించుకోవడానికే మహానాడు పెట్టారు. అసలు ఎన్టీఆర్ వారసుడైన బాలకృష్ణ ఫోటో మహానాడు వేదిక మీద ఎందుకు పెట్టలేదు. ఎమ్మెల్యేగా కూడా గెలవని నారా లోకేష్‌ బొమ్మ ఎలా పెడతారు. లోకేష్ పాదయాత్రకు వెళ్లి చనిపోయిన తారకరత్న ఫోటో ఎందుకు పెట్టలేదు? కేవలం ఎన్‌టీఆర్‌ పేరుతో నాలుగు ఓట్లు సంపాదించుకోవడం కోసమే ఈ ప్రయత్నం. చంద్రబాబు రిలీజ్ చేసిన మ్యానిఫెస్టో ఒట్టి బోగస్. 2014, 2019 నాటి టీడీపీ మేనిఫెస్టోపై చర్చ పెడదాం. చంద్రబాబు ఏం అమలు చేశాడో? ఏపీ సీఎం జగన్ ఏం చేశారో చర్చిద్దాం. గతంలోనే వైఎస్ఆర్ చంద్రబాబు గురించి ఆల్ ఫ్రీ బాబు అని అన్నారు. ఏపీలోని మహిళలకు 1,500 ఇస్తానని చంద్రబాబు అంటున్నారు. సీఎం జగన్ ఇప్పటికే ఎన్నో సంక్షేమ పథకాలు అందిస్తున్నారు.. చంద్రబాబు వచ్చి కొత్తగా ఇచ్చేదేంటి? నాడు వైఎస్ఆర్, నేడు జగన్ ఇద్దరూ కలిసి సుమారు 40 లక్షల ఇళ్లు బీసీల కోసం కట్టించారు. జూనియర్ ఎన్టీఆర్ కు సినిమాలు రాకుండా నిర్మాతలను చంద్రబాబు బెదిరిస్తున్నారు. కర్ణాటక ఎన్నికలలో బీజేపీ, కాంగ్రెస్ వాళ్లు ఇచ్చిన హామీలను కాపీ కొట్టుకొచ్చి ఇక్కడ హామీ ఇచ్చారు’ అని కొడాలి నాని వ్యాఖ్యానించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here