కోవిడ్ కేర్ సెంటర్లో అగ్నిప్రమాద ఘటన: విచారణకు రెండు కమిటీలు నియామకం

AP Govt Forms Two Committees to Investigate Fire Accident at Covid Care Center in Vijayawada

విజయవాడలో కోవిడ్ కేర్ సెంటర్ గా వినియోగిస్తున్న స్వర్ణ ప్యాలెస్ హోటల్ లో ఆదివారం తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో 10 మంది ప్రాణాలు కోల్పోయారు. రమేష్ ఆసుపత్రి ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ కోవిడ్ సెంటర్లో జరిగిన అగ్నిప్రమాద ఘటనపై ఏపీ ప్రభుత్వం విచారణ నిమిత్తం రెండు కమిటీలను నియమించింది. ఆస్పత్రికి ఇచ్చిన అనుమతులు, ఇతర అంశాలపై విచారణకు ఆరోగ్యశ్రీ సీఈవో, వైద్య, ఆరోగ్య శాఖ డైరెక్టర్‌లతో ఒక కమిటీని, అలాగే పూర్తీ స్థాయిలో ప్రమాద కారణాలు తెలుసుకునేందుకు ఇతర అధికారులతో మరో కమిటీని నియమించినట్టుగా ఏపీ డిప్యూటీ సీఎం, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని వెల్లడించారు. 48 గంటల్లోనే నివేదిక అందజేయాలని ఈ రెండు కమిటీలను ఆదేశించినట్లుగా మంత్రి పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu