ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘స్త్రీ శక్తి’ పథకం కింద రాష్ట్ర మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణానికి అయిన ఖర్చుల కోసం నిధులను మంజూరు చేసింది. ఈ మేరకు ప్రభుత్వం రూ. 400 కోట్ల అదనపు నిధులను విడుదల చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.
ఆగస్టు 15 నుంచి ఈ పథకం అందుబాటులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో నాటినుంచి, అక్టోబర్ నెలాఖరు వరకు పథకానికి అయ్యే ఖర్చును ఆర్టీసీకి చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే తాజాగా చంద్రబాబు సర్కార్ నిధులను విడుదల చేసింది.
పథకం, నిధుల వివరాలు..
- పథకం లక్ష్యం: రాష్ట్రంలోని మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని కల్పించడం. ఈ పథకం ఆగస్టు 15 నుంచి అమల్లోకి వచ్చింది.
- నిధుల విడుదల: రవాణా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు.
- హర్షం: స్త్రీ శక్తి పథకానికి నిధులు విడుదల చేయడంపై ఆర్టీసీ ఉద్యోగ సంఘాలు, కార్మిక పరిషత్ నేతలు హర్షం వ్యక్తం చేశారు. ఆర్టీసీ ఎన్‌ఎంయూ నేతలు ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు.










































