పవిత్ర హజ్‌ యాత్రకు.. ఈ నెలాఖరు వరకే గడువు

2022 is The Last Date For Haj Applications, AP Haj applications, AP Haj applications dates, AP Haj applications last date, AP Haj-2022, Haj, Haj 2022, Haj 2022 Application process starts, Haj Applications, Haj applications In Ap, Haj Committee Announces Late Date for Application, haj yatra, Jan 31 2022 is The Last Date For Haj Applications, Jan 31 last date for Haj applications, Mango News

పవిత్ర హజ్‌ యాత్ర.. ప్రతి ముసల్మాన్ జీవిత కల. జీవితంలో ఒక్కసారైనా వెళ్లాల్సిన పవిత్ర యాత్ర అని ప్రతి ఒక్క ముస్లిం భావిస్తారు. దీనిని జీవిత సాఫల్య యాత్రగా పరిగణిస్తారు మత పెద్దలు. ప్రతి సంవత్సరం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కోట్లాది ముస్లింలు 40 రోజుల పవిత్ర హజ్‌ యాత్ర చేస్తారు. హజ్‌ పేరుతో వెళ్లే యాత్రికులు 40 రోజుల మక్కాతో పాటు ప్రవక్త హజరత్‌ మహమ్మద్‌ రసూలుల్లా జన్మస్థలం మదీనా తదితర ప్రాంతాల్లో గడుపుతారు. నమాజులు, తవాఫ్, జికర్, దువా, ఖురాన్‌ పఠనం వంటి కార్యక్రమాలతో నిత్యం అల్లాను స్మరించుకోవడం, హజ్‌ జరిగే రోజు ప్రత్యేక ప్రార్థనలు చేయడమే ఈ యాత్ర ప్రత్యేకత.

ఈ హజ్‌ యాత్ర అనేది ఒకప్పుడు ఆర్థిక స్థోమతతో పాటు, శారీరక ప్రయాసతో కూడుకున్నది. సుదీర్ఘ ఓడ ప్రయాణం, ఆ తరువాత సౌదీలో.. ఒంటెలు, గుర్రాలపై ప్రయాణం వంటి దశలు ఉండేవి. అయితే, విమాన ప్రయాణం మొదలైనప్పటి నుంచి ఈ యాత్ర ఎంతో సులభతరమైంది. ప్రపంచ దేశాల నుంచి ఏటా లక్షలాది మంది హజ్‌ యాత్రకు వెళుతుంటారు. మన తెలుగు రాష్ట్రాలలో కూడా ప్రతి సంవత్సరం కొన్ని వేల మంది హజ్ యాత్రకు వెళ్తుంటారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో.. హజ్‌ యాత్రకు వెళ్లే ముస్లింలకు ప్రభుత్వం తోఫా అందజేయనుంది. రూ.3 లక్షలు లోపు ఆదాయం కలిగిన వారికి రూ.60 వేలు, రూ.3 లక్షల పైన ఆదాయం కలిగిన వారికి రూ.30 వేలు తోఫా అందజేయనుంది. విశాఖతో పాటు విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల నుంచి ఎక్కువగా ముస్లింలు ఏటా హజ్‌ యాత్రకు వెళ్తుంటారు. హజ్‌ కమిటీ ద్వారా ఎంపిక కాని వారు ప్రైవేట్‌ ట్రావెల్స్‌ను ఎంచుకుంటారు. ఉత్తరాంధ్ర నుంచి వెళ్లే హజ్‌ యాత్రికులకు విశాఖలోనే శిక్షణ ఇస్తారు. గతంలో 75 ఏళ్లు నిండిన సీనియర్‌ సిటిజన్లకు హజ్‌యాత్రలో రిజర్వు కేటగిరీ కేటాయించేవారు.

ప్రస్తుతం కోవిడ్‌–19 వచ్చాక నిబంధనలు మారాయి. 65 ఏళ్లలోపు వయసు కలిగిన వారు మాత్రమే యాత్రకు వెళ్లాలి. హజ్‌ యాత్రకు వెళ్లే ముందు ప్రతి యాత్రికుడు తప్పనిసరిగా రెండు డోసుల కోవిడ్‌–19 వ్యాక్సిన్‌ వేయించుకోవాలి. ఆ మేరకు సర్టిఫికెట్‌ కూడా పొందుపరచాల్సి ఉంటుంది. మహిళలకు ఒంటరిగా వెళ్లే అవకాశం ఉండదు. హజ్‌ యాత్రకు వెళ్లే వారిలో చెల్లించే ఫీజును బట్టి గ్రీన్, అజీజియా అనే రెండు కేటగిరీలు ఉంటాయి. గ్రీన్‌ కేటగిరీ వారికి మక్కాకు సమీపంలో బస చేసే సదుపాయం కల్పి స్తారు. అయితే ప్రస్తుత సంవత్సరంలో గ్రీన్‌ కేటగిరీకి ‘ఎన్‌సీఎన్‌టీజడ్‌’ అని పేరు మార్చారు. అంటే ‘నాన్‌ కుకింగ్‌ నాన్‌ ట్రాన్స్‌పోర్ట్‌ జోన్‌’ అని అర్థం.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × five =