విజయనగరం జిల్లా రామతీర్థం బోడికొండపై ఉన్న కోదండ రామాలయంలో విగ్రహ ధ్వంసం ఘటనపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రామతీర్థం ఆలయం ఛైర్మన్ పదవి నుంచి టీడీపీ నేత, మాజీ కేంద్రమంత్రి అశోక్ గజపతిరాజును తొలగిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆలయ నిర్వహణలో వైఫల్యం చెందిన నేపథ్యంలోనే ఆయన్ను పదవి నుంచి తొలగిస్తున్నట్టు పేర్కొన్నారు. అలాగే రామతీర్థంతో పాటుగా పైడితల్లి, తూర్పుగోదావరి జిల్లా మందపల్లి దేవస్థానాల చైర్మన్ పదవి నుంచి కూడా అశోక్ గజపతిరాజును తొలగిస్తున్నట్టు రాష్ట్ర దేవాదాయశాఖ కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ








































