
ఆంధ్రప్రదేశ్‌లో గత ప్రభుత్వంలోని నేతలు ఇసుక, రాళ్లు, గనుల పాటు అన్నిటిని సర్వం దోచేశారని.. ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేశారని ఆరోపిస్తూ చంద్రబాబు ప్రభుత్వం శ్వేత పత్రం పరంపర కొనసాగిస్తోంది. వైసీపీ ప్రభుత్వ విధానాలు, లెక్కల్లో పెద్ద తిక మక ఉందంటూ వరుసగా శ్వేతపత్రాలు రిలీజ్ చేస్తోంది. ఇలా ఇప్పుడు ఏపీలో శ్వేత పత్రాల చుట్టూ పొలిటికల్ ఫైట్స్ నడుస్తోందని సామాన్య ప్రజలు అనుకుంటుంటే.. ప్రజలకు వాస్తవాలు తెలియజేస్తున్నామని తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తుంటే.. కానీ అవి శ్వేతపత్రాలు కాదు జెలసీ పత్రాలని వైసీపీ నేతలు అంటున్నారు. మొత్తంగా ఏపీలో వైసీపీ, టీటీడీ నేతల మధ్య పొలిటికల్ యుద్ధం నడుస్తోంది.
ఏపీలో అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ కూటమి.. వైసీపీ ప్రభుత్వ విధానాలను వేలెత్తి చూపుతోంది. వాళ్లు అధికారంలో ఉన్న ఐదేళ్లలో ఏపీలో జరిగింది ఇదే.. ప్రస్తుతం ఇదీ ఏపీ పరిస్థితి అంటూ ఒక్కో ప్రభుత్వం మీద వైట్ పేపర్స్ రిలీజ్ చేస్తోంది. ముందుగా ఏపీ జీవనాడి పోలవరం ప్రాజెక్టుపై శ్వేతపత్రం రిలీజ్ చేసిన సీఎం..ప్రాజెక్టు వాస్తవ పరిస్థితిపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. అలాగే చంద్రబాబు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావించే అమరావతితో పాటు విద్యుత్, సహజవనరుల దోపిడీ పైన కూడా శ్వేతపత్రాన్ని విడుదల చేశారు. అలాగే ఈరోజు 3 గంటలకు శాంతిభద్రతల అంశంపైన కూడా సీఎం చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేయనున్నారు.
ఏపీ ప్రజలకు వాస్తవాలు తెలియచేసే ఉద్దేశంతోనే తాను రంగాల వారీగా శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నామని చెబుతున్న సీఎం చంద్రబాబు.. రాష్ట్ర స్థితిగతులను పరిశీలించే కొద్దీ ప్రతి రంగంలోనూ ఎన్నో అవకతవకలు బయటపడుతున్నాయని ఆరోపిస్తున్నారు. ఏ శాఖను చూసినా ఘోరమైన పరిస్థితులే ఉన్నాయని అంటున్నారు. ఇంకా మరికొన్ని అంశాలపైన కూడా శ్వేత పత్రాలు రిలీజ్ చేస్తామని, వాటిపై అసెంబ్లీలో కూడా చర్చ బెడతామని చెబుతున్నారు. అయితే ఈ శ్వేతపత్రాలే కాదు. టీడీపీ ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలు కూడా పూర్తిగా అవాస్తవమే అంటోంది వైసీపీ. ఎన్నికల్లో ప్రజలకిచ్చిన సాద్యం కాని హామీలను ఇచ్చిన అమలుచేయలేక శ్వేతపత్రాల పేరుతో ఇలా డైవర్ట్ చేస్తున్నారని వైసీపీ ఆరోపిస్తోంది. దోపిడీ జరిగిందని.. అవినీతికి పాల్పడ్డారని ఆరోపిస్తున్నారు కానీ శ్వేత పత్రాల పేరుతో తమకు అవినీతి మరక అంటించే ప్రయత్నం జరుగుతోందని వైసీపీ ఆరోపిస్తోంది. అయితే తాము అధికారంలోకి వచ్చి 50 రోజులు కూడా కాలేదు. అప్పుడే తొందరపడితే ఎలా అని టీడీపీ నేతలు సమాధానమిస్తున్నారు. మొత్తంగా కూటమి ప్రభుత్వం, గత ప్రభుత్వం మధ్య మాటల యుద్ధం నడుస్తోంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE